Kotamreddy Sridhar Reddy: చంద్రబాబు ట్రాప్‌లో పడలేదు.. ప్రజల ట్రాప్‌లో పడ్డా.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే..
ఎక్కడా తగ్గేదే అంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తనపై వస్తున్న ఆరోపణలు తిప్పికొడుతున్నారు. ఈయన తిరుతో నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఎక్కడా తగ్గేదే అంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తనపై వస్తున్న ఆరోపణలు తిప్పికొడుతున్నారు. ఈయన తిరుతో నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. విమర్శలు, సవాళ్లతో రోజూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తనపై ఎవరు ఆరోపణ చేసినా.. విమర్శలు చేసినా.. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు.. గెలిచిన పార్టీ మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.. దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. అయితే టీడీపీలో గెలిచి వైసీపీ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలు పదవిని వదిలేస్తే.. తాను కూడా సిద్ధమేనేంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తాను చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో పడలేదనీ.. ప్రజల ట్రాప్‌లో పడ్డానన్నారు. తానొక సాధారణ MLAని మాత్రమేననీ. తనతో ఆయనకు పని ఏముంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తన అభిప్రాయం మాత్రమే చెప్పాననీ.. నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబే అన్నారు కోటంరెడ్డి.
అధికారం అనుభవించి చివర్లో బయటకి వెళ్లడం ఇష్టం లేదనీ.. ఏడాదిన్నర ముందే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డానన్నారు. ఈ కష్టసమయంలో తనకు అండగా నిలుస్తున్న కొంత మంది అనుచరులకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు కోటంరెడ్డి. వాటిని లెక్క చేయకుండా తన వెన్నంటి నిలుస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజలపక్షాన నిరసన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.
త్వరలో జరగబోయే ఇరుకళల అమ్మవారి జాతర నిర్వహణకు అనుమతి కోసం దేవాదాయ శాఖకు లేఖ రాస్తానని ఇందులో కూడా రాజకీయం చేస్తే అప్పుడు తీసుకోవాల్సిన ఏం చేయాలనేది ఆలోచిస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..