- Telugu News Photo Gallery Business photos Check PF Balance Online: Know These Four Ways To Check Your EPFO Balance On Mobile
EPFO: ఉద్యోగులకు ఇక నో టెన్షన్.. మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.. పూర్తి వివరాలు..
ఆన్‌లైన్‌లో PF బ్యాలెన్స్‌ని తెలుసుకోవడానికి చందాదారులు నాలుగు సులభమైన మార్గాలను ఉపయోగించవచ్చు. అవేంటో తెలుసుకోవడం చాలా మంచిది. దీనివల్ల నిమిషాల్లోనే బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది.
Updated on: Feb 08, 2023 | 1:07 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల కోసం సేవలను విస్తరిస్తూ వస్తోంది. ఉద్యోగుల PFని ఉపసంహరించడం.. దగ్గరి నుంచి నామినీ పేరు మార్పు వరకు పలు మార్పులు చేసింది.

పరిశ్రమలు, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం EPFO మూడు పథకాలు అందుబాటులో ఉన్నాయి. EPF స్కీమ్ 1952, పెన్షన్ స్కీమ్ 1995 (EPS), ఇన్సూరెన్స్ స్కీమ్ 1976 (EDLI) అనేవి PF, పెన్షన్ కవరేజీ కింద ఉద్యోగులను కవర్ చేసే మూడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి.

ప్రస్తుత EPF వడ్డీ రేటు 8.10%.. ఈపీఎఫ్ఓ డిజిటల్ పద్ధతులను అవలంబించడంతో అనేక సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వినియోగదారు/చందాదారు వ్యక్తిగతంగా కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా బ్యాలెన్స్‌ను మీ ఫోన్ ద్వారా కూడా తనిఖీ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో PF బ్యాలెన్స్‌ని తెలుసుకోవడానికి చందాదారులు నాలుగు సులభమైన మార్గాలను ఉపయోగించవచ్చు. అవేంటో తెలుసుకోండి..

SMS: UAN యాక్టివేట్ అయిన సభ్యులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపడం ద్వారా EPFOలో అందుబాటులో ఉన్న వారి తాజా PF బ్యాలెన్స్ గురించి తెలుసుకోవచ్చు. 7738299899 ఫోన్ నెంబర్ కి “EPFOHO UAN” టైప్ చేసి మెస్సెజ్ చేయాలి.. ఈ సదుపాయం ఇంగ్లీష్ (డిఫాల్ట్), హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ భాషలలో అందుబాటులో ఉంది.

మిస్డ్ కాల్: UAN పోర్టల్‌లో నమోదు చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFO చందాదారులు తమ వివరాలను పొందవచ్చు. రెండు రింగ్‌ల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. ఈ సేవను ఉచితంగా పొందవచ్చు. సభ్యుని UAN బ్యాంక్ A/C నంబర్, ఆధార్, పాన్‌తో ఫోన్ నెంబర్ యాడ్ అయి ఉంటే.. సభ్యులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మెస్సెజ్ రూపంలో వస్తాయి.

EPFO

ఉమంగ్ పోర్టల్ యాప్: ఉమంగ్ ప్లాట్‌ఫారమ్‌లో EPFO యాప్‌ని ఉపయోగించడం ద్వారా కూడా మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే, యాప్ స్టోర్, విండోస్ స్టోర్ నుంచి ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ సేవను పొందవచ్చు.





























