AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: నేటి నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ

ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఆలయ పండితులు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను  సమర్పించనున్నారు.

Srisailam: నేటి నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ
Srisailam Brahmotsavam
Follow us
Surya Kala

|

Updated on: Feb 11, 2023 | 9:11 AM

మహాశివరాత్రి పర్వదినానికి దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు అంగరంగ వైభంగా ముస్తాబవుతున్నాయి. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా శ్రీశైలం క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలు వెరీవెరీ స్పెషల్. నేటి నుండి ఈనెల 21 వరకు మల్లన్న దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఆలయ పండితులు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను  సమర్పించనున్నారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ధ్వజపటం ఆవిష్కరణ చేయనున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలు:

ఈ నెల 11న సాయంత్రం మల్లన్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం 12వ తేదీన భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ జరుగనుంది. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పించనున్నారు. ఈ నెల 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు. ఈ నెల 16న పుష్పపల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రభోత్సవం.. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ ఉండనుంది. అర్ధ రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 19న సాయంత్రం రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 20న పూర్ణాహుతి కార్యక్రమం.. రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ ఉండనుంది. ఈనెల 21న అశ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

స్పర్శదర్శన వేళలు:

ఈ నెల 23వ తేదీ వరకు 15 రోజులపాటు శివ స్వాములు జ్యోతిర్ముడి సమర్పించడానికి ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. శివ స్వాములకు నేటి నుంచి 15వ తేదీ వరకు నిర్ధిష్ట వేళలో మల్లిఖార్జునుడి స్పర్శదర్శనం కల్పించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..