AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Guru Yuti 2023: 12 ఏళ్ల తర్వాత సూర్య-గురు గ్రహ కలయిక.. ఇక ఈ 3 రాశులకు కనకవర్షమే.. కానీ వారికి తీవ్ర ఇబ్బందులు..

గ్రహాలకు రాజుగా పిలుచుకునే సూర్యుడు.. 2023 ఏప్రిల్ 22న బుద్ధి, వివేకానికి మూల కారకుడైన గురుడితో కలిసి మేషరాశిలో యుతి ఏర్పర్చనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..

Surya Guru Yuti 2023: 12 ఏళ్ల తర్వాత సూర్య-గురు గ్రహ కలయిక.. ఇక ఈ 3 రాశులకు కనకవర్షమే.. కానీ వారికి తీవ్ర ఇబ్బందులు..
Surya Guru Yuti 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 11, 2023 | 9:52 AM

Share

గ్రహాలకు రాజుగా పిలుచుకునే సూర్యుడు.. 2023 ఏప్రిల్ 22న బుద్ధి, వివేకానికి మూల కారకుడైన గురుడితో కలిసి మేషరాశిలో యుతి ఏర్పర్చనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఒక రాశిలో రెండు గ్రహాల కలయిక ఏర్పడినప్పుడు దాని ప్రభావం శుభకరంగా లేదా ఇబ్బందులను కలిగించేదిగా ఉంటుంది. ఇంకా జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యగురు గ్రహాల యుతి కొన్ని రాశుల వారికి శుభకరంగా,  మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. ఎందుకంటే 12 ఏళ్ల తరువాత ఈ రెండు రాశుల మహా సంయోగం ఈ ఏడాది ఏర్పడనుంది. సూర్యుడిని, గురుడిని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అత్యంత కీలకమైన గ్రహాలుగా భావిస్తారు. ముఖ్యంగా గురు గ్రహాన్ని దానం-పుణ్యం, చదువు-జ్ఞానం, ఆధ్యాత్మిక విషయాలకు కారకుడిగా పిలుస్తారు. అలాంటి ఈ రెండు గ్రహాలు సంయోగం చెందితే దాని ప్రభావం కూడా వివిధ రాశులపై బలంగానే పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఏయే రాశులకు శుభప్రదం అంటే.. 

మేష రాశి: గురు, సూర్య గ్రహాల యుతి కారణంగా మేషరాశి జాతకులకు వ్యాపారం, ఉద్యోగంలో లాభం, వృద్ధి కలగనుంది. ఈ సందర్బంగా మేషరాశివారు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆ వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఈ యుతి ఆర్ధిక విషయాల్లో చాలా లాభం కల్గిస్తుంది. దాంతోపాటు కష్టపడినదానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది.

మిధునరాశి: మిథున రాశి జాతకులకు ఊహించనివిధంగా ఆర్ధిక ప్రయోజనం కలగనుంది. ఒకవేళ ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకుంటే..చాలా మంచి సమయం. ఈ కాలంలో మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఒకవేళ మనస్సు పెట్టి పనిచేస్తే అభివృద్ధి కొత్త శిఖరాల్ని చేరుకుంటుంది. విద్యార్ధులకు విజయం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

తుల రాశి: గురు సూర్య గ్రహాల మహా సంయోగం తులా రాశి జాతకులకు లాభదాయకంగా ఉండనుంది. ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి, ఆనందం కలుగుతుంది. తిండి వ్యవహారాలపై దృష్టి పెట్టి బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. దాంతోపాటు ఖర్చు, ఆదా విషయాలపై శ్రద్ధ అవసరం. ఈ మహా సంయోగం కారణంగా ఆదాయం పెరుగుతుంది.

ఈ రాశివారికి ప్రతికూల ప్రభావం..

వృషభ రాశి: మేషరాశిల సూర్య, గురు గ్రహాల యుతి కారణంగా పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ సమయంలో మీరు కోపంగా ఉండవచ్చు. ఫలితంగా మీ గౌరవ ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. పనిచేసేచోట సమస్యలు రావచ్చు.

కర్కాటక రాశి: ఈ సందర్భంగా అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. లేకపోతే సమస్యలు ఉత్పన్నం కావచ్చు. డబ్బులు నష్టపోతారు. అందుకే వీలైనంతవరకూ ఆర్ధిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృధా ఖర్చులకు పోకూడదు.

కన్య రాశి: సూర్య గురు గ్రహాల యుతి కారణంగా తల్లి ఆరోగ్యం సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. అనారోగ్య లక్షణాలన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమస్య తలెత్తితే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)