- Telugu News Photo Gallery Business photos Okaya Faast F3 electric scooter now launched in India at at rs 99999 and check here for more details
Okaya Faast F3: భారత్ మార్కెట్‌లోకి వచ్చేసిన అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర, ఇతర వివరాలివే..
OKAYA Faast F3 ఎలక్ట్రిక్ స్కూటర్: కొన్ని నెలల క్రితం OKAYA Faast F3 టీజర్‌ను విడుదల చేసిన ఒకాయ EV ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా లాంచ్ చేసింది. మీరు రూ. 1 లక్షలోపు ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, OKAYA Fast F3 మీకు మంచి ఎంపికగా ఉంటుంది.
Updated on: Feb 11, 2023 | 8:16 AM

భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ OKAYA EV తన OKAYA Faast F3ని రూ.99,999 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.53 kWh డ్యూయల్ Li-ion LFP బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

OKAYA Faast F3లోని బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే..125 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఇంకా ఈ బ్యాటరీ వాటర్‌ప్రూఫ్, డస్ట్-రెసిస్టెంట్అవడం దీని ప్రత్యేకత. బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరచడానికి, స్విచ్చబుల్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4, 5 గంటలు పడుతుంది.

OKAYA కంపెనీ OKAYA Faast F3 స్కూటర్‌లోని బ్యాటరీ, మోటారుపై 3 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తోంది. ఇక ఈ ఫాస్ట్ ఎఫ్3 స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.

ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల గురించి మాట్లాడాలంటే.. ఇది రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్ వంటి ఫీచర్లను పొందుతుంది. సస్పెన్షన్ డ్యూటీలను ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు హైడ్రాలిక్ స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్స్ నిర్వహిస్తాయి. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కలర్ వేరియంట్లలో విడుదలైంది.

ఇందులో మ్యాట్ గ్రీన్, మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సియాన్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను.. భారతదేశంలో అత్యుత్తమ నాణ్యత గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డిమాండ్‌ను తీర్చడానికి ప్రవేశపెట్టినట్లు OKAYA కంపెనీ తెలిపింది.

కంపెనీ ప్రకారం OKAYA Faast F3 డిజైన్ కస్టమర్లకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అత్యాధునిక సాంకేతికత, ఫీచర్లతో ఇది భారత మార్కెట్లోకి విడుదలైంది. మీరు రూ. 1 లక్షలోపు ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఫాస్ట్ ఎఫ్3 కూడా మంచి ఎంపిక.





























