AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Formula E Championship: నేడే హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్‌.. షెడ్యుల్, ప్రత్యేకతల వివరాలివే..

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన జరగనున్న ఫార్ములా రేస్‌కు సమయం ఆసన్నమయింది. ఈ రోజు(ఫిబ్రవరి 11) హైదరాబాద్ వేదికగా మెగా ఇంటర్నేషనల్..

Formula E Championship: నేడే హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్‌.. షెడ్యుల్, ప్రత్యేకతల వివరాలివే..
Formula E Championship Hydearbad
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 11, 2023 | 9:56 AM

Share

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన జరగనున్న ఫార్ములా రేస్‌కు సమయం ఆసన్నమయింది. ఈ రోజు(ఫిబ్రవరి 11) హైదరాబాద్ వేదికగా మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్ ప్రారంభం కానుండడంతో.. ఈ రేస్‌ను చూసేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రేసింగ్ అభిమానులు వచ్చారు. ఇక హుస్సేన్ సాగర్ తీరాన, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ఉదయం 8.05 గంటలకు ఫ్రీ ప్రాక్టీస్ రేస్-2 మొదలవుతుంది. ఇక దీని పూర్తి షెడ్యూల్ చూస్తే.. ఉదయం 8.10 నుంచి 8.40 గంటల వరకు ఫ్రీ ప్రాక్టీస్‌-2 ఉంటుంది. తర్వాత ఉదయం 10.40 నుంచి 12.05 గంటల వరకు క్వాలిఫయింగ్‌ రేసు ఉంటుంది. ఆనంతరం మధ్యాహ్నం 1.40 నుంచి 1.55 గంటల వరకు డ్రైవర్స్‌ పరేడ్‌ ఉంటుంది. మధ్యాహ్నం 3.04 గంటల సమయానికి అసలైన రేసు మొదలవుతుంది. సాయంత్రం 4.35కి మీడియా సమావేశం జరిపి.. ఈ రేసు గురించి వివరిస్తారు.

ఇక ఈ రేసుకు భారీ ఏర్పాట్లు కూడా చేశారు నిర్వహకులు. ఒకేసారి 21 వేల మంది చూసేందుకు తగిన సదుపాయాలను కల్పించారు. 2.8 కిలోమీటర్ల సర్క్యూట్‌పై మొత్తం 11 జట్ల కింద.. 22 మంది రేసర్లు ఇవాళ రేసులో పాల్గొంటారు. ఇందులో గంటకు 322 కిలోమీటర్ల హై స్పీడ్ తో దూసుకెళ్లే ఫార్ములా కార్లు(జెన్‌3 కార్లు) పరుగులు తీయనున్నాయి. మరో విశేషమేమంటే.. ఈ రేసులో విదేశీ కంపెనీలు, రేసర్లతోపాటూ.. భారత్‌ నుంచి మహీంద్ర రేసింగ్‌, టీసీఎస్‌ జాగ్వార్‌ కూడా ఉన్నాయి. అయితే ఈ ఫార్ములా రేస్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2013లో జరిగిన ఫార్ములా-1 రేసు తర్వాత.. భారత్‌లో తొలిసారిగా ఈ రేస్ జరుగుతోంది. అందులోనూ హైదరాబాద్‌లో జరుగుతుండటం తెలుగు రాష్ట్రాల ప్రత్యేకం అనుకోవచ్చు. ఇందులో ప్రపంచస్థాయి రేసర్లు కూడా పాల్గొంటారు. ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్‌ రేసింగ్ చరిత్రలో నిలిచింది.

కాగా, ఈ రేస్ నిజానికి నిన్న శుక్రవారమే మొదలైంది. ఫ్రీ ప్రాక్టీస్‌ రేస్-1లో రేసర్లు ట్రాక్ ఎలా ఉందో చూసుకున్నారు. రయ్యిమంటూ దూసుకెళ్లారు. ఈ ట్రయల్ వెర్షన్ కూడా రేసింగ్ చూసేవాళ్లను ఆకట్టుకుంది. రియల్ రేసు లాగానే ఇది సాగడంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. దాదాపు అరగంటపాటూ సాగిన ప్రాక్టీస్‌ రేసులో అంతా బాగానే జరిగినా.. పాస్కల్‌ వెర్లిన్‌ నడిపిన పోర్షే కారుకి యాక్సిడెంట్ అయ్యింది. రేసర్‌కు ఎలాంటి గాయాలు కాకపోయినా.. ఫార్ములా రేస్ అంటేనే అలా ఉంటుందని.. ఆ రేంజ్ వేగానికి ఇలాంటివి సహజమేనని అంటున్నారు అభిమానులు. ఇక ఈ ప్రాక్టీస్ సెషన్ చూసేందుకే నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ప్రీ ప్రాక్టీస్‌ రేస్‌ చూడ్డానికి ప్రముఖులు తరలివచ్చారు. నారా బ్రాహ్మణి, మహేశ్‌బాబు సతీమణి నమ్రత, ఎన్టీఆర్‌ భార్య ప్రణతితో పలువురు.. గ్యాలరీల్లో కూర్చుని సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..