AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: చెప్పుల విషయంలో ఈ తప్పులు ఆసలు చేయకండి.. ఆ దిక్కున పెట్టినా కూడా నెత్తిన దరిద్రం కూర్చున్నట్లే..!

వాస్తు విషయంలో అలా నిర్లక్ష్యం చేసే విషయాల్లో చెప్పులు పెట్టుకునే చోటు కూడా ఒకటి. చెప్పులు ఉండాల్సిన చోట లేకపోతే దురదృష్టం వెంటాడుతుందని వాస్తు..

Vastu Tips: చెప్పుల విషయంలో ఈ తప్పులు ఆసలు చేయకండి.. ఆ దిక్కున పెట్టినా కూడా నెత్తిన దరిద్రం కూర్చున్నట్లే..!
Vastu For Chappal And Shoes
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 09, 2023 | 10:17 AM

ఎన్నో వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు పాటిస్తూ వచ్చిన వాస్తు.. కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాదు. ఇంటి అమరిక, ఇంట్లో వస్తువు ఏది ఎక్కడ ఉండాలనే విషయాల గురించి కూడా ప్రస్ఫుటంగా చర్చిస్తుంది. అంతేకాక చిన్న చిన్న వాస్తు తప్పులు కూడా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతో పాటు దైనందిన జీవితంలో ఇబ్బందులకు కూడా కారణం కాగలవు. ఇంకా వాస్తు శాస్త్రం అనేది ఇంటికి సంబంధించిన చిన్న విషయం నుంచి అతి పెద్ద విషయం వరకు ప్రతీ ఒక్క అంశాన్ని పరిగనణలోకి తీసుకుని రూపొందించినది కనుక వాస్తును అనుసరించడం వల్ల లాభమే తప్ప నష్టం లేదని నిపుణులు,మన పూర్వీకులు చెబుతున్న మాట. చిన్న చిన్న నియమాలను నిర్లక్ష్యం చెయ్యడం  వల్ల ఇంట్లో నివసించే వ్యక్తులు పెద్ద మూల్యం చెల్లించాల్సి రావచ్చు. వాస్తు విషయంలో అలా నిర్లక్ష్యం చేసే విషయాల్లో చెప్పులు పెట్టుకునే చోటు కూడా ఒకటి. చెప్పులు ఉండాల్సిన చోట లేకపోతే దురదృష్టం వెంటాడుతుందని వాస్తు హెచ్చరిస్తోంది. అదృష్టాన్ని ఎప్పుడూ మన వెంటే ఉంచుకోవాలనుకుంటే తప్పకుండా చెప్పుల స్టాండ్‌కు లేదా చెప్పులకు సంబంధించిన వాస్తు నియమాలను అనుసరించడమే మంచిదని అంటున్నారు వాస్తు నిపుణులు. మరి చెప్పుల విషయంలో పాటించవలసిన వాస్తు నియమాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. చెప్పులు ఎప్పుడూ చిందర వందరగా ఉండకూడదు. ఇలా చెప్పులు చిందరవందరగా పారేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు వస్తాయట. తూర్పు, ఉత్తర దిక్కులను శాస్త్రం పవిత్రంగా భావిస్తుంది. ఈ దిక్కులు దేవుడు నెలవుంటాడని నమ్మకం. కనుక అటువైపు చెప్పులు వదల కూడదు. ఈ దిక్కున చెప్పులు పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి.
  2. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలి. అది మంచి అలవాటు కానే కాదు. తప్పకుండా చెప్పుల కోసం ఒక షూర్యాక్ చేయించుకోవాలి. అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి. ఇంట్లో షూ రాక్ పెట్టుకోవడానికి సరైన దిక్కు నైరుతి అని వాస్తు శాస్త్రం చెబుతోంది. కనుక షూర్యాక్ ఉన్నా లేకున్నా.. అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి.
  3. చిన్న ఇళ్లలో నివసించే కొందరు షూరాక్ పెట్టుకునేందుకు సరైన చోటు లేకపోవడం వల్ల బెడ్ రూమ్ లో పెట్టుకుంటారు. ఇది ఆ కుటుంబానికి హానికరం. ఇలా చెయ్యడం వల్ల భార్యా భర్తల మధ్య గొడవలు రావచ్చు. దాంపత్య జీవితం ప్రమాదంలో పడుతుంది. ఇంట్లో శాంతి కరువవుతుంది. కనుక చెప్పుల రాక్ ఎప్పుడూ కూడా బెడ్ రూమ్ లో ఉండకూడదు.
  4. ఇంటి ముఖద్వారం చాలా పవిత్రమైంది. ఇక్కడి నుంచే ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కనుక తప్పనిసరిగా ముఖద్వారం పరిసరాలు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా బావించి పూజిస్తారు కూడా. అందుకే ముఖద్వారం వద్ద చెప్పులు, షూ ర్యాక్ పెట్టుకోవడం మంచిదికాదు. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అలిగి వెనక్కి వెళ్లిపోతుందని అంటారు. కనుక ముఖద్వారం ముందు చెప్పులు వదల కూడదు.
  5. డబ్బు, నగలు దాచుకునే అల్మారా లేదా బీరువా లేదా కంబోర్డ్ ను చాలా పూజనీయంగా చూసుకోవాలి. ఈ బీరువాలు, అల్మారాల కింద చెప్పులు వదల కూడదు. అసలు ఆ గదిలోకే చెప్పులతో రాకుండా ఉండడం మంచిది.