Maha Shivratri 2023: శని, కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడుతున్నారా.. నివారణ కోసం మహా శివరాత్రి రోజున శివయ్యను ఇలా ఆరాధించండి..

ఈ ఏడాది మహా శివరాత్రి ఈ నెల 18 వ తేదీన వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం , మహాశివరాత్రితో పాటు.. శని ప్రదోషం,  వాశి యోగం, సన్ఫ యోగం, శంఖ యోగం, సర్వార్థ సిద్ధి యోగం కలగలిసి వచ్చాయి. ఈ శుభ యోగాలలో చేసే పూజ-పారాయణ పనులు అనేక రెట్లు ఫలితాలను ఇస్తాయి.

Maha Shivratri 2023: శని, కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడుతున్నారా.. నివారణ కోసం మహా శివరాత్రి రోజున శివయ్యను ఇలా ఆరాధించండి..
Maha Shiva Ratri 2023
Follow us

|

Updated on: Feb 09, 2023 | 11:16 AM

సనాతన హిందూ ధర్మంలో మహా శివరాత్రి ముఖ్యమైన పర్వదినం. ఈ రోజు శివుడిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా ..  ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. శివయ్య భక్తులు ఏడాది పొడవునా మహా శివరాత్రి కోసం వేచి చూస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం, మహాశివరాత్రి రోజున చేసే పూజలు, ఉపవాసం, జాగారం .. భక్తుడి కష్టాలు రెప్పపాటులో తొలగిపోతాయి.. సుఖ సంతోషాలు పొందుతారని విశ్వాసం. ఈ ఏడాది మహా శివరాత్రి ఈ నెల 18 వ తేదీన వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం , మహాశివరాత్రితో పాటు.. శని ప్రదోషం,  వాశి యోగం, సన్ఫ యోగం, శంఖ యోగం, సర్వార్థ సిద్ధి యోగం కలగలిసి వచ్చాయి. ఈ శుభ యోగాలలో చేసే పూజ-పారాయణ పనులు అనేక రెట్లు ఫలితాలను ఇస్తాయి. దీంతో మహా శివరాత్రికి మతపరమైన ప్రాముఖ్యతతో పాటు.. జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత కూడా పెరిగింది. మహాశివరాత్రి రోజున శని, కాల సర్ప దోష నివారణ కోసం పరిహారాల గురించి  తెలుసుకుందాం.

శని సంబంధిత దోషాలను తొలగించే శివపూజ  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ జాతకంలో శని దోషం మీ కష్టాలకు ప్రధాన కారణంగా మారుతున్నట్లయితే.. నివారణ కోసం ఈ మహాశివరాత్రి రోజున శివయ్యను పూజించడం శుభఫలితాలను ఇస్తుంది. శివయ్య పూజలో బిల్వ పత్రాన్ని సమర్పించి,  మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే.. ఆ వ్యక్తికి శని దోషం వలన కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు. మహాశివరాత్రి నాడు శనికి సంబంధించిన దోషం తొలగిపోవడానికి.. ముఖ్యంగా శివునికి రుద్రాభిషేకం చేయండి. రుద్రాభిషేకం చేసే వీలు లేకపోతే.. రుద్రాక్ష  జపమాలతో శివ సహస్రనామం లేదా శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించండి.

కాలసర్ప దోషం తొలగిపోవడానికి శివారాధన  సనాతన సంప్రదాయంలో… ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉన్నట్లు అయితే.. వారి జీవితంలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.  జీవితంలో అభివృద్ధి నిలిచిపోతే.. మహా శివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం అత్యుత్తమం. ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరంలో లేదా నాసిక్‌లో ఉన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని లేదా ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తక్షకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో మహాశివరాత్రి రోజున పూజించి, రుద్రాభిషేకం చేస్తే.. జాతకానికి సంబంధించిన కాల సర్ప దోషం నుండి విముక్తి పొందుతారని విశ్వసం. అంతేకాదు కాల సర్ప దోషాన్ని నివారించడానికి.. మహాశివరాత్రి రోజున శివాలయంలో ఒక జత వెండి నాగుపాములను సమర్పించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)