Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. గురువారం దినఫలాలు..
జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. వారంతా రాశి ఫలాలతోనే రోజును ప్రారంభిస్తారు. వాటి ద్వారానే కార్యక్రమాలను మెదలు పెట్టడం లేదా పనులను వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తారు.
జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. వారంతా రాశి ఫలాలతోనే రోజును ప్రారంభిస్తారు. వాటి ద్వారానే కార్యక్రమాలను మెదలు పెట్టడం లేదా పనులను వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తారు. ఈరోజు (గురువారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితం సంతోషంగా సాగిపోతుంది. అధికారులు బాగా ప్రోత్సహిస్తారు. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఎంజాయ్ చేస్తారు. అతి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. పిల్లలు శుభవార్త చెబుతారు. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు అందుకుంటారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరి ష్కారం అవుతుంది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగి పోతాయి.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సాంకేతిక రంగంలోని వారు ఎంతగానో రాణిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఆర్థికపరంగా కొద్దిపాటి అదృష్టం పడుతుంది. ఒకటి రెండు రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితుల సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. అవసరానికి తగ్గట్టుగా మాత్రమే డబ్బు అందుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు. పొదుపు పాటించడం మంచిది. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఉద్యోగ, వ్యాపార జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. వాగ్దానాలకు, హామీలకు దూరంగా ఉండండి. ప్రేమ జీవితం బాగానే ఉంటుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఉద్యోగంలో అధికారులు మీ గురించి తప్పుగా అంచనా వేస్తారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆర్థిక పరిస్థితి ఒక మోస్తరుగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగానే ఉంటుంది. బంధు వర్గంలో మీ మాటకు వీరు పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం పరవాలేదు.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ముఖ్యమైన వ్యవహారాలలో ఆచి తూచి అడుగులు వేయటం మంచిది. ఉద్యోగంలో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు ఒక చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది. హామీలు ఉండవద్దు.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ విషయాలలో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహచరులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. హద్దులు మీరిన ఔదార్యాన్ని తగ్గించుకోవడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఆర్థికంగా బాగానే ఉంటుంది. వృత్తి నిపుణులు గుర్తింపు తెచ్చుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ముఖ్యమైన పనులలో తిప్పట ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత కొద్దిగా తగ్గుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. శరీరానికి విశ్రాంతి అవసరం. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రేమ జీవితంలో అపార్ధాలు తలెత్తుతాయి.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి సాను కూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. బంధువులు అపార్థం చేసుకుంటారు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ జీవితంలో ఉత్సాహం పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి
నోట్: రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..