Zodiac Signs: ఆ రంగం వారికి గుడ్ న్యూస్.. ఈ రాశుల వారికి శుభకాలం.. ఇక ఎదురే ఉండదట..

మీడియా రంగం సమూలంగా మార్పులకు లోనవుతోంది. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటువంటి పరిస్థితులలో మీడియా రంగంలోని జర్నలిస్టులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

Zodiac Signs: ఆ రంగం వారికి గుడ్ న్యూస్.. ఈ రాశుల వారికి శుభకాలం.. ఇక ఎదురే ఉండదట..
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 08, 2023 | 2:07 PM

మీడియా రంగం సమూలంగా మార్పులకు లోనవుతోంది. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటువంటి పరిస్థితులలో మీడియా రంగంలోని జర్నలిస్టులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జర్నలిస్టుల జీవన గమనం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. దినపత్రికలు, టీవీ ఛానెల్స్, వెబ్ పత్రికలలో పని చేసే పత్రికా రచయితలంతా ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోబోతున్నారో, ఏ ఏ గ్రహాలు వీరికి సహకరించబోతున్నాయో, ఏ ఏ రాశుల వారు పురోగతి చెందబోతున్నారో పరిశీలించవలసి ఉంది. సాధారణంగా గురు, బుధ గ్రహాలు పత్రికా రచనకు సంబంధించిన గ్రహాలుగా గుర్తింపు పొందాయి. జాతక చక్రంలోని ఒకటి మూడు ఐదు పది రాశులు పత్రికారచయితల జీవితం గురించి చెబుతాయి. మిగిలిన గ్రహాలు కూడా ఈ విషయంలో కొద్దిగా ప్రాధాన్యం సంతరించుకున్నప్పటికీ, అన్నిటికంటే ముఖ్యంగా గురు గ్రహం, బుధ గ్రహాల అనుగ్రహం మీదే పత్రికా రచయితల జీవితాలు అదృష్టాలు ఆధారపడి ఉంటాయి.

ఈ ఏడాది ఈ రెండు గ్రహాలు మిధున, కర్కాటక, కన్య, తుల, మకర రాశి వారికి బాగా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఈ రాశుల వారు, ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నవారు బాగా రాణించే అవకాశం ఉంది. సాధారణంగా మిధున, కన్యా రాశి వారిలో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రాశులకు బుధుడు అధిపతి. రచనా వ్యాసంగానికి బుధుడు కారకుడు. కమ్యూనికేషన్స్ కి కూడా బుధుడే కారకుడు. గురువు ప్రయాణాలకు, చలనానికి కారకుడు. ఈ గ్రహమే అదృష్టానికి కూడా కారకుడు.

మిథున రాశి: గత జనవరి 18 నుంచి ఈ రాశి వారు పత్రికా రంగంలో ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంది. ఏప్రిల్ 23 నుంచి ఇది మరింత వేగం పుంజకుంటుంది. ఆధునిక విజ్ఞాన అవకాశాలను వీరు చక్కగా, వేగంగా అందిపుచ్చుకుంటారు. వార్తల సేకరణలో అందరి కంటే ముందుంటారు. సరికొత్త అంశాలను వెలికి తీస్తారు. పరిశోధనాత్మక పత్రికా రచనలలో కొత్త వరవడి సృష్టిస్తారు. మొత్తం మీద ఈ రంగంలో స్థిరపడి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ ఏడాది ఈ రాశి వారు తమ పత్రికలోనే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశి వారు సాధారణంగా కార్యాలయంలో కూర్చోవడం కంటే బయట తిరగడానికి ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల ఎక్కువగా వీరు విలేకరులుగా రాణించడానికి అవకాశం ఉంది. అయితే ఏ విభాగంలో ఉన్నప్పటికీ వీరు తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయటం జరుగుతుంది. రాజకీయ పరిస్థితులు, నేరాలు, న్యాయస్థానాలు వంటి అంశాలలో వీరు అనూహ్యమైన పురోగతి సాధిస్తారు. అంతేకాక, పత్రికా రంగంలో వీరు కొత్తవారికి శిక్షణ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. స్వతంత్రంగా కథనాలు రాయడంలో, రచనలు చేయడంలో వీరు సిద్ధహస్తులు. ఈ ఏడాది ఈ రాశి వారు మంచి గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు ఆర్థికంగా కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

కన్య రాశి: ఈ రాశి వారు రాజకీయ అంశాలలో మంచి కథనాలు అందించగలరు. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ముందస్తు కథనాలు ఇవ్వడంలో వీరు ప్రసిద్ధులు అవుతారు. రాజకీయ కథనాలతో పాటు ఆర్థిక, సామాజిక కథనాలు కూడా వీరు ఇవ్వడం జరుగుతుంది. వీరు గ్రంథ రచన చేయడానికి కూడా అవకాశం ఉంది. వీరు అతి తక్కువ కాలంలోనే అంకెలంచెలుగా ఈ రంగంలో పురోగతి సాధించే సూచనలు ఉన్నాయి. పత్రికా రంగంలోనే కాక ప్రభుత్వం నుంచి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ ఏడాది వీరు అన్ని విధాలా అగ్రస్థానంలో నిలబడతారు. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది.

తులా రాశి: పత్రికా రంగంలో కొనసాగుతున్న ఈ రాశి వారు పత్రిక కథనాల రచనలో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. రాజకీయాలతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాలు, సినిమా, టీవీ తదితర రంగాలలో ఈ రాశి వారు అమోఘంగా రాణించే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు ప్రింట్ మీడియాలో కంటే ఎలక్ట్రానిక్ మీడియాలో రాణించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందులో కూడా విలేకరులుగా వీరు విజయాలు సాధించడం జరుగుతుంది. సొంత రచనలు సొంత కథనాలతో వీరు గుర్తింపు తెచ్చుకుంటారు. పత్రికా రంగంలో ఒక వరవడి సృష్టిస్తారు. ఈ రంగానికి సంబంధించినంత వరకు వీరి జీవితం అనేక సానుకూల మలుపులు తిరుగుతుంది.

మకర రాశి: ఈ రాశి వారు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా అనే తేడా లేకుండా ఏ విభాగంలో అయినా దూసుకుపోవడానికి అవకాశం ఉంది. ఈ రంగంలో వీరి కథనాలకు, రచనలకు డిమాండ్ పెరుగుతుంది. పత్రికా రచయితగా వీరి సామాజిక హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది గురు బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. వీరి సంపాదన కూడా బాగా పెరుగుతుంది. సాధారణంగా ఈ రాశి వారు రాజకీయేతర విభాగాలలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. సామాజిక, ఆర్థిక, క్రీడలు వంటి రంగాలలో వీరికి గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..