AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిగ్బల రాజయోగం.. మార్చి నెలలో ఉద్యోగం, ఆర్థికంగా ఢోకా ఉండదు..!

Digbala Yoga in March 2026: జ్యోతిష శాస్త్రంలో గ్రహాల దిగ్బలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. సొంత రాశి లేదా నిర్దిష్ట స్థానాల్లో గ్రహాలు సంచరిస్తే దిగ్బల యోగం ఏర్పడి రాజయోగ ఫలితాలు ఇస్తాయి. ప్రస్తుతం వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఈ శుభయోగం కలిగి మార్చి నెలంతా ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వం మరియు విజయాలను అందించే అవకాశం ఉంది.

దిగ్బల రాజయోగం.. మార్చి నెలలో ఉద్యోగం, ఆర్థికంగా ఢోకా ఉండదు..!
Career Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 6:52 PM

Share

March 2026 Career Horoscope: జ్యోతిష శాస్త్రంలో గ్రహాల దిగ్బలానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. సొంత రాశిలో బుధుడు లేదా గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు లేదా చంద్రుడు, సప్తమ స్థానంలో శనీశ్వరుడు, దశమ స్థానంలో కుజుడు లేదా రవి సంచారం చేస్తున్నప్పుడు ఈ దిగ్బల యోగం ఏర్పడుతుంది. గ్రహాలకు దిగ్బలం ఏర్పడినప్పుడు అవి తప్పకుండా ఏదో ఒక రూపంలో రాజయోగం కలిగిస్తాయి. ఉద్యోగంలోనే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఏం చేసినా చెలామణీ అయిపోతుంది. ప్రస్తుతం ఈ యోగం వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభ రాశులకు పట్టింది. ఈ రాశులకు మార్చి నెలంతా ఈ యోగం కొనసాగుతుంది.

  1. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ, రవుల సంచారం వల్ల ఈ రెండు విధాలుగా దిగ్బల రాజయోగం పట్టింది. దీనివల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి లాభం, ఆకస్మిక ధన లాభం కలుగుతాయి. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.
  2. మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల అనేక విధాలుగా ప్రాధాన్యం, ప్రాభవం, గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ ఉంటుంది. గృహ, వాహన సౌఖ్యాలు ఏర్పడతాయి.
  3. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల దిగ్బల రాజయోగం కలిగింది. ఇది విపరీత రాజ యోగాన్ని కలగజేస్తుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. రాజకీయాలు, పాలనా రంగంలో ఉన్నవారికి అధికార యోగంతో పాటు ఆర్థిక యోగం కూడా పడుతుంది. ఉద్యోగులకు ఉన్నత స్థానాలు లభిస్తాయి. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బలపడతాయి.
  4. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి మార్చి 2 నుంచి విపరీత రాజయోగం కలుగుతుంది. దీనివల్ల గృహ, వాహన యోగాలు పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. తల్లి తండ్రులతో సాన్నిహిత్యం వృద్ధి చెందుతుంది. మాతృమూలక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి.
  5. కుంభం: ఈ రాశిలో బుధ గ్రహ సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం ఏర్పడింది. దీనివల్ల రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ప్రభుత్వంలో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఉద్యోగ జీవితంలో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆర్థిక సంబంధమైన అనుకూలతలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది.

Follow Us