Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope (April 06, 2026): సోమవారం రాశిఫలాలు ప్రకారం మేషం నుంచి మీనం వరకు చాలా రాశుల వారికి ఆర్థికంగా, వృత్తి పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మేష, వృషభ రాశుల వారికి ఆదాయం పెరగడం, ప్రయత్నాలు సఫలం కావడం జరుగుతాయి. మిథున, మకర రాశుల వారు బాధ్యతలు పెరగడంతో పాటు ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం.

దిన ఫలాలు (ఏప్రిల్ 6, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఇంటా బయటా బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభ గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. బకాయిలు వసూలవుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంటా బయటా బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల పురో గతికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత వాహనాలను వేగంగా నడపకపోవడం శ్రేయస్కరం. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వ్యాపారంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవమర్యాదలకు లోటుండదు. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనారోగ్య సమస్య నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో చక్కబడతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పని భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు అత్యధికంగా లాభం పొందుతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొద్దిగా ఆలస్యంగానే అయినా ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సానుకూలంగా సాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా చిక్కుల్లో పడతారు. మనసు లోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగి, తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం పడుతుంది. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగుతుంది. వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వవద్దు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆస్తి కొనుగోలు వ్యవహారంపై దృష్టి పెడతారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. వాహనం కొనే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది.