Solar Eclipse: 2023లో తొలి సూర్య గ్రహణం.. ఈ 5 రాశులకు ఏప్రిల్ 20 నుంచి తప్పించుకోలేనన్ని కష్టాలు..

ఈ ఏడాది అంటే 2023లో ఏర్పడనున్న 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు ప్రభావం 12 రాశులపై వేర్వేరుగా ఉండనుంది. కొన్ని రాశులకు అత్యంత శుభ సూచకమైతే..మరికొన్ని

Solar Eclipse: 2023లో తొలి సూర్య గ్రహణం.. ఈ 5 రాశులకు ఏప్రిల్ 20 నుంచి తప్పించుకోలేనన్ని కష్టాలు..
Solar Eclipse 2023
Follow us

|

Updated on: Feb 08, 2023 | 11:19 AM

ప్రతి సంవత్సరం ఏర్పడే గ్రహణాల ప్రభావం రాశి చక్రంలోని 12 రాశుల జాతకచక్రాలపై ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అంటే 2023లో ఏర్పడనున్న 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు ప్రభావం 12 రాశులపై వేర్వేరుగా ఉండనుంది. కొన్ని రాశులకు అత్యంత శుభ సూచకమైతే..మరికొన్ని రాశులకు తీవ్ర నష్టాల్ని చేకూర్చనుంది. అయితే ఈ ఏడాదిలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల జీవితంలో కష్టాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయని అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఈ సూర్య గ్రహణం ఉదయం 7 గంటల 4 నిమిషాలకు ఏర్పడి.. మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే..  ఈ గ్రహణం మన దేశంలో కన్పించకపోయినా.. ఈ రాశి వారి జీవితంపై పెను ప్రభావం పడనుంది.

సూర్య గ్రహణం ప్రభావం ఏయే రాశులపై ఉండనుందంటే.. 

మేషరాశి: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం ఏర్పడినప్పుడు ఆ సమయంలో సూర్యుడి మేషరాశిలో ఉంటాడు. ఈ క్రమంలో ఈ రాశివారి కెరీర్‌లో సమస్యలు పెరుగుతాయి. ఈ రాశివారి జీవితంపై సూర్యుడి ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో అత్యవసరమైన పనులు చాలావరకూ నిలిచిపోతాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సూర్య గ్రహణం మేషరాశి వారికి ఆర్ధిక సమస్యల్ని పెంచేస్తుంది. వ్యక్తికి మానసిక ఒత్తిడి ఎదుర్కోవల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

సింహరాశి: సూర్య గ్రహణం ఈ రాశి జాతకుల పనులను పాడుచేస్తుంది. ఫలితంగా చాలా కష్టనష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. కానీ ఆ తరువాత పరిస్థితులు చక్కబడతాయి.

ఇవి కూడా చదవండి

కన్యారాశి: కన్యారాశి జాతకులకు కుండలిలో 8వ పాదంలో సూర్య గ్రహణం మానసిక కష్టాల్ని కలుగజేస్తుంది. మీలో కోపం పెరిగి తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతారు. కొన్ని వస్తువులపై దృష్టి పెట్టడం వల్ల లాభముంటుంది. ఈ సందర్భంలో మీ వాయిస్ నియంత్రణలో ఉంచుకోకపోతే సమస్యలు మరింత జటిలమౌతాయి. యాత్రలు నష్టాల్ని కలగజేస్తాయి.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి 6వ పాదంలో సూర్య గ్రహణం ఏర్పడనుంది. దాంతో ఈ రాశి జాతకులు ప్రత్యర్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అందుకే సుదూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం.

మకర రాశి: జ్యోతిష్యం ప్రకారం మకర రాశి జాతకులకు కుండలిలో 4వ పాదంలో సూర్య గ్రహణం ఏర్పడటం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడనుంది. ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. అనవసరపు వృధా ఖర్చులు బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..