AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ఆసీస్ సిరీస్‌లో కింగ్ కోహ్లీని ఊరిస్తున్న 3 రికార్డులు.. మరోసారి ‘విరాట్’ రూపం చూపిస్తేనే సాధ్యం.. వివరాలివే..

ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు వన్డేలు ఆడిన కింగ్ కోహ్లీ 67.6 సగటుతో 338 పరుగులు చేశాడు. ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ రన్..

Virat Kohli: ఆసీస్ సిరీస్‌లో కింగ్ కోహ్లీని ఊరిస్తున్న 3 రికార్డులు.. మరోసారి ‘విరాట్’ రూపం చూపిస్తేనే సాధ్యం.. వివరాలివే..
Virat Kohli
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 08, 2023 | 7:43 AM

Share

ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా.. టీమిండియాపై నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇంకా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల(ఫిబ్రవరి) 9 నుంచి నాగ్‌పూర్‌లో భారత్-ఆసీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. అయితే టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. అంతేకాదు శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్‌ ఈ సిరీస్‌కు దూరం కావడంతో మిడిలార్డర్‌లో కోహ్లీ తలపై పెద్ద బాధ్యతే ఉందని చెప్పుకోవాలి.  ఆసియా కప్ తర్వాత ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో వింటేజ్ కోహ్లీని తలపిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు వన్డేలు ఆడిన కింగ్ కోహ్లీ 67.6 సగటుతో 338 పరుగులు చేశాడు. ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ రన్ మెషిన్. అందుకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సద్వినియోగం చేసుకోవాలని కూడా భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కోసం మూడు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. మరి కోహ్లీని ఊరిస్తున్న ఆ 3 రికార్డులు ఏమిటంటే..

ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీలు:

ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ చివరిసారి 2018లో సెంచరీ  సాధించాడు. పెర్త్‌లో జరిగిన ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ మరో రెండు సెంచరీలు సాధిస్తే దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న టెస్టు సెంచరీల రికార్డు బద్దలవుతుంది. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కుతాడు. ఆస్ట్రేలియాపై కోహ్లీ ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో 7 సెంచరీలు సాధించాడు. గవాస్కర్ 20 మ్యాచుల్లో 8 సెంచరీల సాధించాడు. ఇక ఆస్ట్రేలియాపై 11 సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మొదటి స్థానంలో  ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

టాప్-5 ఆటగాళ్ల లిస్ట్ 

ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమయ్యే ఈ సిరీస్ ద్వారా కోహ్లీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. అత్యధిక టెస్టు పరుగులు సాధించిన టీమిండియా ఆటగాళ్లలో 8,119 పరుగులతో కోహ్లీ ప్రస్తుతం 6 స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ కనీసం 391 పరుగులు సాధిస్తే వీరేంద్ర సెహ్వాగ్ (8,503 పరుగులు) రికార్డును అధిగమిస్తాడు. ఫలితంగా అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఐదో ఆటగాడు అవుతాడు.

అత్యంత వేగంగా 25 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా.. 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని మరో అద్భుతమైన రికార్డు ఊరిస్తోంది. అదేమిటంటే.. కోహ్లీ ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 24,936 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 8,119, వన్డేల్లో 12,809, టీ20ల్లో 4008 పరుగులు సాధించిన కోహ్లీ మొత్తం 546 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో కనుక కోహ్లీ మరో 64 పరుగులు సాధిస్తే 25 వేల పరుగులు సాధించిన రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా 6 క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన క్రికెటర్‌గానూ రికార్డులకెక్కుతాడు కింగ్ కోహ్లీ. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. టెండూల్కర్ 576 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.

మరిన్నిక్రీడా వార్తల కోసం క్కడ క్లిక్ చేయండి..