- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS Test Anil Kumble is the Indian player with most wickets in border gavaskar trophy
IND vs AUS Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చెక్కుచెదరని భారత మాజీ ప్లేయర్ రికార్డు.. బద్దలు కొట్టేందుకు లియాన్, అశ్విన్ పోటీ..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ రేసులో అశ్విన్ కంటే నాథన్ లియోన్ కొంచెం పైనే ఉన్నాడు. అయితే ఈ ఇద్దరూ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇక్కడ విశేషమేమంటే టాప్ 5 ప్లేయర్లలో భారత క్రికెటర్ నంబర్ వన్‌గా ఉన్నాడు. అతనెవరంటే..
Updated on: Feb 08, 2023 | 9:06 AM

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకూ జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు..? ఆ రికార్డుపై ఒక భారతీయ ఆటగాడి పేరిటనే ఉంది. అయితే అతను రవిచంద్రన్ అశ్విన్ లేదా రవీంద్ర జడేజా కానే కాదు.

భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ అంటే అశ్విన్, నాథన్ లియోన్ మధ్య వికెట్ల గొడవ ఎప్పుడూ ఉంటుంది. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ రేసులో అశ్విన్ కంటే నాథన్ లియోన్ కొంచెం పైనే ఉన్నాడు. ఇంకా ఈ ఇద్దరూ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.

ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ లియాన్ 22 టెస్టుల్లో 94 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే భారత సీనియర్ స్పిన్సర్ అశ్విన్ 18 టెస్టుల్లో 89 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉన్నాడు. వీరితో పాటు రవీంద్ర జడేజా కూడా 12 టెస్టుల్లో 63 వికెట్లు తీసి.. 5వ స్థానంలో ఉన్నాడు.

ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ విషయానికొస్తే.. కేవలం 20 టెస్టుల్లో 111 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున 1996-2008 మధ్య కాలంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన కుంబ్లే ఈ రికార్డును నమోదు చేశాడు. అయితే ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పదిలంగా ఉంది.

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అనిల్ కుంబ్లే ఉండగా, ఈ జాబితాలో హర్భజన్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. భజ్జీ 18 టెస్టుల్లో 95 వికెట్లు తీశాడు. అయితే అశ్విన్, లియాన్ లాంటి బౌలర్లతో ఇప్పటికే రిటైర్ అయిన భజ్జీ ఈసారి వెనుకబడడం ఖాయం. వికెట్ల కోసం అశ్విన్, లియాన్ పోటీ పడుతున్న నేపథ్యంలో కుంబ్లే రికార్డు కూడా ప్రమాదంలో పడవచ్చు.




