AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Surya Yuti 2023: ఈ నెల 13న కుంభరాశిలో సూర్యుడు-శని కలయిక.. ఈ 5 రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తగా ఉండాల్సిందే..

జ్యోతిష్యం ప్రకారం.. సూర్యుడు ..  శని గ్రహాల మధ్య స్నేహ సంబంధాలు లేవు. ఇద్దరి ప్రకృతి వైరుధ్యభావాలను కలిగి ఉంది.  సూర్యుడు వేడి  కారకుడు, శని చల్లదనానికి కారణం. కనుక వీరిద్దరూ ఏ రాశిలో కలిసినా.. అది శుభకరం కాదు.

Shani Surya Yuti 2023: ఈ నెల 13న కుంభరాశిలో సూర్యుడు-శని కలయిక.. ఈ 5 రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తగా ఉండాల్సిందే..
Shani Dev
Surya Kala
|

Updated on: Feb 09, 2023 | 7:27 AM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఒక రాశిలో రెండు గ్రహాల కలయిక ఏర్పడినప్పుడు దాని ప్రభావం శుభకరంగా లేదా ఇబ్బందులను కలిగించేదిగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడు.. శనీశ్వరుడు ఒకరితో ఒకరు శత్రుత్వం కలిగి ఉన్నారు. వాస్తవానికి సూర్యుడు తనయుడు శనీశ్వరుడు.. అయినప్పటికీ ఇద్దరికీ మధ్య శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో సూర్యుడు ఫిబ్రవరి 13న మకర రాశి నుండి బయలుదేరి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. దీంతో ఫిబ్రవరి 13న తన కుమారుడిని సూర్యుడు కలవనున్నారు. సూర్యుడు,శని రెండూ కుంభరాశిలో కూటమిగా ఏర్పడనున్నాయి. కుంభరాశిలో శనితో సూర్యుని కలయిక మార్చి 15, 2023 ఉదయం 06:13 వరకు ఉంటుంది. అనంతరం సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 13 నుండి మార్చి 15 వరకు కుంభరాశిలో సూర్యుడు-శని కలయిక కారణంగా కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీరు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.

సూర్యుడు-శని సంయోగం జ్యోతిషశాస్త్ర ప్రకారం.. శనీశ్వరుడు చాలా నెమ్మదిగా కదిలేగ్రహం. దీని కారణంగా.. స్థానికులపై శని దృష్టి శుభం లేదా అశుభ ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. శని సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత జనవరి 17 న తన రాశిని మార్చుకున్నాడు. శని కుంభ రాశిలో 2025 సంవత్సరం వరకు ఉంటాడు. అయితే శనీశ్వరుడి తండ్రి సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. ఫిబ్రవరి 13, 2023 న.. సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ కారణంగా..తండ్రి, కొడుకులిద్దరూ ఒక నెల పాటు ఒకే రాశిలో ఉంటారు.

సూర్యుడు-శని కలయిక ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందంటే..  జ్యోతిష్యం ప్రకారం.. సూర్యుడు ..  శని గ్రహాల మధ్య స్నేహ సంబంధాలు లేవు. ఇద్దరి ప్రకృతి వైరుధ్యభావాలను కలిగి ఉంది.  సూర్యుడు వేడి  కారకుడు, శని చల్లదనానికి కారణం. కనుక వీరిద్దరూ ఏ రాశిలో కలిసినా.. అది శుభకరం కాదు. అయితే శనిశ్వరుడు మకరం, కుంభ రాశులకు అధిపతి. శని తన స్వంత రాశిలో ఉన్నప్పుడు.. ఆ రాశివారికి పెద్దగా ఇబ్బంది కలిగించదు. అయితే సూర్యదేవుడు తన కుమారుడు రాశిలో ఉన్నప్పుడు.. పూర్తిగా అశుభాన్ని కలిగించరు. అయినప్పటికీ గ్రహాలు వారి స్వభావం..  మిత్ర-శత్రువు భావన కారణంగా కొంత ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి సూర్యుడు, శనీశ్వరుడు కలయిక ఈ రాశివారి జాతకంలో ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది. దీని కారణంగా ఈ రాశివారు ఫిబ్రవరి 13 నుండి మార్చి 15 వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు, పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం క్షీణించవచ్చు. కోపం పెరగవచ్చు.. ఇటువంటి పరిస్థితిలో.. ఈ రాశివారు ఈ ఒక్క నెల పాటు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

సింహరాశి  ఈ  రాశి వ్యక్తుల జాతకంలో ఏడవ ఇంటిని సూర్యుడు-శని కలయిక ప్రభావితం చేస్తుంది. జాతకంలో ఏడవ ఇంటిని జీవిత భాగస్వామిగా, భాగస్వామిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో.. వైవాహిక జీవితంపై కొంత ప్రభావితం చూపించవచ్చు. కొన్ని చట్టపరమైన విషయాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఎవరితోనైనా భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు అడ్డంకులు, విభేదాలను సృష్టించవచ్చు. ఈ సమయంలో ఈ రాశివారిని ఎవరైనా మోసం చేయవచ్చు.

కన్య రాశి ఈ రాశివారి జాతకంలో ఆరవ ఇంటిలో సూర్య-శని కలయిక ఏర్పడుతుంది. కనుక ఈ రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి సూర్యుడు-శని కలయిక వల్ల సమస్యలు పెరుగుతాయి. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అభివృద్ధిలో ఉన్న పని మధ్య ఆగిపోతుంది.  శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సంబంధాలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కొన్ని రోజులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

వృశ్చికరాశి ఈ రాశి వారిని సూర్యుడు.. శని కలయిక ఇబ్బంది పెడుతుంది. సూర్యుడు , శని దేవుడు ఈ రాశివారి జాతకంలో నాల్గవ స్థానంలో ఉంటారు. ఉద్రిక్తత పెరుగుతుంది. వ్యాపారవేత్తలు కొంత నష్టాన్ని భరించవలసి ఉంటుంది. చిన్న ప్రమాదాలు ఏర్పడవచ్చు.

కుంభ రాశి ఇప్పటికే కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు.. ఈ నేపథ్యంలో సూర్యుడు-శని సంయోగం జరగబోతోంది. ఫిబ్రవరి 13 నుండి మార్చి 15 వరకు సూర్యుడు కూడా కుంభరాశిలో ఉంటాడు. దీంతో కుంభరాశి వారి సమస్యలు పెరుగుతుంది. వాదోపవాదాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ రాశి వ్యక్తులు ఆలోచనాత్మకంగా నడవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)