AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow Baby Shower: అంగరంగ వైభవంగా ఆవుకు సీమంతం.. 500మంది అతిథులు.. 24 రకాల వంటలతో విందు ఎక్కడంటే..

ఓ కుటుంబం వైభంగా గోమాతకు సీమంతం ఫంక్షన్ చేశారు. ఇలాంటి అపురూప దృశ్యం తమిళనాడులోని ఓ గ్రామంలో కనిపించింది. కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామంలో గర్భిణిగా ఉన్న ఆవుకు సాంప్రదాయం సీమంతం వేడుక చేశారు. ఈ వేడుకలో దాదాపు 500 మంది అతిథులు కూడా పాల్గొన్నారు. 

Cow Baby Shower: అంగరంగ వైభవంగా ఆవుకు సీమంతం.. 500మంది అతిథులు.. 24 రకాల వంటలతో విందు ఎక్కడంటే..
Cow Baby Shower Function
Surya Kala
|

Updated on: Feb 09, 2023 | 8:49 AM

Share

Cow Baby Shower: హిందువులు ఆవుని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అంతేకాదు ఆవుని ఎంతో ఇష్టంగా, సొంత ఇంటి పిల్లల్లా భావించి పెంచుకుంటారు. ఆవులు.. వాటి సంతానాన్ని తమ ఇంటి సభ్యుల్లా ఎంతో అల్లారు ముద్దుగా చూడడమే కాదు.. వాటికి సీమంతం, పుట్టిన రోజు , నామకరణం వంటి ఫంక్షన్లు జరిపి పదిమందికి తమ సంతోషాన్ని పంచుతూ వేడుకలను జరుపుతారు. తాజాగా ఓ కుటుంబం వైభంగా గోమాతకు సీమంతం ఫంక్షన్ చేశారు. ఇలాంటి అపురూప దృశ్యం తమిళనాడులోని ఓ గ్రామంలో కనిపించింది. కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామంలో గర్భిణిగా ఉన్న ఆవుకు సాంప్రదాయం సీమంతం వేడుక చేశారు. ఈ వేడుకలో దాదాపు 500 మంది అతిథులు కూడా పాల్గొన్నారు.

మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మేలపట్టు గ్రామంలో ఉన్న ఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ ఈ ఆవును సంరక్షిస్తుంది. ఈ ఆవు పేరు అంశవేణి. సీమంతం వేడుక సందర్భంగా ఆవును బాగా అలంకరించారు. మహిళలు చక్కగా దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ ఫంక్షన్ లో ఆవుకి మొత్తం 24 రకాల వంటకాల వంటకాలతో విందునిచ్చారు. ఇందులో పండ్లు, స్వీట్లు మొదలైనవి ఉన్నాయి. అంతేకాదు.. సీమంతం చేసుకున్న ఆవుకు అనేక రకాల గిప్టులు అందాయి. మహిళలు ధరించే కంకణాలతో సహా 48 రకాల కానుకలు కూడా ఆవుకు అందాయి.

సీమంతం వేడుక సీమంతం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు గోవుకు స్నానం చేయించారు. అనంతరం పూలతో, గంటలతో అలంకరించారు. వేడుక పూర్తి అయిన తర్వాత.. ప్రజలు ఆవు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రజలందరికీ ప్రసాదం పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆవును దత్తత తీసుకోవడం లేదా ఆవులను గోమాతగా భావించి పెంచుకోవడం .. సీమంతం వేడుక చేయడం ఇదే తొలిసారి కాదు.. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లోని ప్రజలు తరచుగా తమ ఆవుకు సీమంతం వేడుక.. పుట్టిన లేగ దూడకు బారసాల వేడుక చేయడం సార్వాసాధారణమే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..