AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doda Crisis: జమ్మూకశ్మీర్‌కి విస్తరించిన భూమి పగుళ్లు.. దోడాలో కుంగిపోతున్న భూమి.. ఇళ్లకు బీటలు

జోషీమఠ్‌లో ఈ మధ్య భూమి కుంగిపోవడం చూశాం. ఇప్పుడు అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి జమ్మూకశ్మీర్‌లోని ఓ పట్టణంలో.!

Doda Crisis: జమ్మూకశ్మీర్‌కి విస్తరించిన భూమి పగుళ్లు.. దోడాలో కుంగిపోతున్న భూమి.. ఇళ్లకు బీటలు
Doda Crisis
Surya Kala
|

Updated on: Feb 04, 2023 | 9:30 AM

Share

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ ఉత్పాతం ఇప్పుడు జమ్మూకశ్మీర్‌కూ విస్తరించింది. దోడా జిల్లాలోని టటరీ మున్సిపాలిటీకి చెందిన నయీ బస్తీ ఏరియాలో భూమి కుంగిపోవడం మొదలైంది.స్థానిక ప్రజలు భయాందోళనకు గురమవుతున్నారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంతో పాటు భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు అదే తరహాలో జమ్మూకశ్మీర్‌లోని దోడా పట్టణం పగుళ్లు వస్తున్నాయి. దీని కారణంగా బస్తీలోని 20కి పైగా ఇళ్లతో పాటు ఓ మసీదుకు బీటలు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దోడా మున్సిపల్ పరిధిలోని నాయి బస్తీ గ్రామంలో దాదాపు 50 ఇళ్లు ఉన్నాయి. డిసెంబర్‌లో ఒక ఇంట్లో పగుళ్లు వచ్చాయని.. ఇప్పుడు ఆ సంఖ్య 20కి పెరిగిందంటున్నారు స్థానికులు. ఈ గురువారం కొండచరియలు విరిగిపడిన తర్వాతే ఎక్కువ ఇళ్లు బీటలు తీశాయంటున్నారు.

ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా.. బీటలు వారిన కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 19 కుటుంబాలను తరలించినట్టు అధికారులు ప్రకటించారు. మరోవైపు భూమి కుంగిపోవడానికి కారణాలు ఏంటనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాలు అక్కడకు వెళ్లాయి. రోడ్ల నిర్మాణం, గ్రామానికి పక్కనే నది ప్రవహించడంతో పాటు కొండ చరియలు విరిగి పడిన కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..