Alive Man Death Anniversary: బతికి ఉండగానే తన వర్ధంతిని జరుపుకున్న వృద్ధుడు.. పేదలకు అన్నదానం, దుప్పట్ల పంపిణీ
తాను మరణించాక తన వర్ధంతి చేస్తారో చేయరో అని భావించాడో ఏమో పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడు బ్రతికుండగానే తన వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాడు. ఇలా గత ఐదేళ్లుగా వర్ధంతి కార్యక్రమాన్ని తనకు తానే నిర్వహించుకుంటూ ఉన్నాడు.
ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే.. తల్లికొడుకు.. అన్నాతమ్ముడు.. అక్కచెల్లెలు.. ఇలా ఏ బంధమైనా సరే.. డబ్బుతో తులతూగుతున్నాయి నేటి కాలంలో.. బతికి ఉండగానే తనవారిని పెట్టించుకోవడం లేదు.. కొందరు డబ్బులు లేవని తమ తల్లిదండ్రులను బంధాలను వదిలేస్తే.. మరికొందరు.. డబ్బులు తీసుకుని తన్ని తరిమేస్తున్నారు.. ఇంకొందరు.. బరువు బాధ్యతలు తమకొద్దు అంటూ బంధాలకు దూరంగా జరుగుతున్నారు.. దీంతో బతికి ఉండగానే తమ జీవితం ఇలా ఉంటే.. ఇక మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సాధారణంగా మనిషి మరణించిన అనంతరం.. అతని కుటుంబ సభ్యులు వారికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరణించిన వారిని గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే కారణమేదైనా కొందరు మాత్రం వర్ధంతిని నిర్వహించరు. దీనిని ఓ వృద్ధుడు ఆలోచించాడు. తాను మరణించాక తన వర్ధంతి చేస్తారో చేయరో అని భావించాడో ఏమో పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడు బ్రతికుండగానే తన వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాడు. ఇలా గత ఐదేళ్లుగా వర్ధంతి కార్యక్రమాన్ని తనకు తానే నిర్వహించుకుంటూ ఉన్నాడు. ఇందుకు అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించారు.
ఫతేగఢ్ సాహిబ్ జిల్లా మజ్రి సోధియా గ్రామానికి చెందిన భజన్ సింగ్ వృత్తిరీత్యా ఓ మిల్లులో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే శాస్త్రబద్ధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అందరికీ తెలియచేయడమే తన ఉద్దేశమని ఆ భజన్ సింగ్ తెలిపారు. తన వర్ధంతి కార్యక్రమంలో భాగంగా పేదలకు దుప్పట్లు పంచాడు. అనాధలకు భోజనం పెట్టించాడు. ఇలా తాను ఐదేళ్లుగా వర్ధంతి జరుపుకుంటున్నట్టు తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..