Budget App: రేపే కేంద్ర బడ్జెట్.. మీ ఫోన్ నుంచి కూడా చూసే అవకాశం.. ఎలా చూడాలో తెలుసా?
పేపర్ లెస్ బడ్జెట్ కారణంగా వెబ్ సైట్, యాప్ ద్వారా కూడా సామాన్యులకు ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. అలాగే యాప్ లో ప్రతి పేజిని సవివరంగా చూసే విధంగా ఏర్పాటు చేశారు.
రేపు పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టనున్నారు. రెండు సంవత్సరాల నుంచి ప్రవేశపెడుతున్న తరహాలోనే ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బడ్జెట్ అనేది ప్రతిసారి కేవలం ఉన్నత ప్రభుత్వ వర్గాలు, అలాగే ఎంపీలకు అందుబాటులో ఉంటుంది. అయితే పేపర్ లెస్ బడ్జెట్ కారణంగా వెబ్ సైట్, యాప్ ద్వారా కూడా సామాన్యులకు ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. అలాగే యాప్ లో ప్రతి పేజిని సవివరంగా చూసే విధంగా ఏర్పాటు చేశారు. బడ్జెట్ ను ఇలా యాప్ రూపంలో అందించే విధానాన్ని కరోనా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 2021 లో ప్రవేశపెట్టింది. ఇది కరోనా నుంచి రక్షణ కోసమే రూపొందించినా డిజిటల్ ఇండియా పరంగా ఇదో కీలక ముందడగు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాప్ ను డీఈఏ మార్గదర్శకత్వంలో ఎన్ఐసీ అభివృద్ధి చేసింది.
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం చేసే ప్రసంగం పూర్తయ్యాక బడ్జెట్ యాప్ లో పౌరులకు అందుబాటులో ఉంటుంది. డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లుతో పాటు బడ్జెట్ లోని 14 పత్రాలు ఇందులో చూడవచ్చు. అలాగే ఈ యాప్ లో బడ్జెట్ కీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇది ముఖ్యంగా యూనియన్ బడ్జెట్ ను ఎలా చదవాలో వివరిస్తుంది. ఈ విభాగం వార్షిక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్, గ్రాంట్స్ కోసం డిమాండ్, రసీదు బడ్జెట్, వ్యయ ప్రొఫైల్ వంటి బడ్జెట్ భాషను సులభంగా అర్థం అయ్యేలా చేస్తుంది. కేంద్ర మంత్రి ప్రసంగాన్ని అనుసరించి బడ్జెట్ హైలెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీగా కీలక ప్రకటనలను చేరేవేస్తుంది. వినియోగదారులకు వీక్షణపరంగా మంచి అనుభూతి ఉండేలా యాప్ ను డిజైన్ చేశారు. ఇందులోని పత్రాలు ఎంత జూమ్ చేసినా స్పష్టం కనిపిస్తాయి. అయితే ఈ యాప్ ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ యాప్ యూనియన్ బడ్జెట్ (యూబీ) పేరుతో ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే అధికారిక యూనియన్ బడ్జెట్ వెబ్ సైట్ నుంచి కూడా సులభంగా యాప్ కు సంబంధించిన డౌన్ లోడ్ లింక్ ద్వారా మన ఫోన్స్ ఇన్ స్టాల్ చేసకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..