Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్ ఫిబ్రవరి 6న.. ప్రభుత్వం, గవర్నర్ రాజీతో మారిన సీన్..
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ మారింది. ముందుగా అనుకున్న ఫిబ్రవరి 3వ తేదీన కాకుండా.. ఫిబ్రవరి 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయని దరిమిలా..
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ మారింది. ముందుగా అనుకున్న ఫిబ్రవరి 3వ తేదీన కాకుండా.. ఫిబ్రవరి 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయని దరిమిలా.. అటు ప్రభుత్వం, ఇటు గవర్నర్ మధ్య జరిగింది ఒప్పందంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అసెంబ్లీని ప్రోరోగ్ చేయనున్నారు గవర్నర్.. ఆ వెంటనే కొత్త సెషన్ కోసం రాజ్ భవన్ నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ఆమోదం తెలుపనున్నారు. అంతేకాదు.. పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ప్రోరోగ్ తర్వాత సాంకేతిక అంశాల కారణంగా బడ్జెట్‌ను 3 రోజులు వాయిదా వేసింది ప్రభుత్వం. తిరిగి 6వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఉప్పు నిప్పులా ఉన్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య బడ్జెట్ సమావేశాలు కాస్త ఊరట తీసుకొచ్చినట్లే కనిపిస్తున్నాయి. పోటాపోటీగా కోర్టుకెక్కిన ఈ వ్యవహారంలో ఎట్టకేలకు రెండు వర్గాల్లో ఓ గుడ్‌న్యూస్‌ను తీసుకొచ్చాయి. తెలంగాణ అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తే తప్ప బడ్జెట్ పెట్టే అవకాశం లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే దానికి గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల పరస్పర చర్చల తర్వాత ఒక రాజీ కుదిరింది. ఆ రాజీతో అసెంబ్లీ ప్రోరోగ్, కొత్త నోటిఫికేషన్ లాంచనంగా మారాయి. ఆ ప్రక్రియను ఇవాళ రాజ్‌భవన్ మొదలుపెడితే.. ఈ నెల 6న బడ్జెట్ ప్రవేశపెట్టే వీలుంది..
ఢిల్లీలో ఒక వ్యూహం, రాష్ట్రంలో మరో వ్యూహంలో బీఆర్‌ఎస్..
రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో నేరుగా కేసీఆరే ఆమెకు స్వాగతం పలికారు. ఆమె విషయంలో ఎలాంటి విబేధాలూ లేవు. కేవలం బీజేపీ పాలనలో వైఫల్యాలను ఎండగడతూ ఆమె ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తోంది బీఆర్‌ఎస్. కానీ, గవర్నర్‌తో ఉప్పునిప్పులా ఉండి.. ఇప్పుడు ఆమెను ప్రసంగం కోసం వెల్‌కమ్ చెప్పింది ప్రభుత్వం.
శాశ్వతమా? తాత్కాలికమా?..
ఇంతకీ ఈ ప్రగతిభవన్-రాజ్‌భవన్‌ల మధ్య గ్యాప్ తగ్గితే ఇది శాశ్వతమా.. తాత్కాలికమా అని తేల్చడానికి మరో లెక్కుంది. అదే సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులు. ఆ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తారా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవే..
1) తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు
2) ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేసే బిల్లు
3) ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ
4) మున్సిపల్ చట్ట సవరణ
5) పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ
6) ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు
7) మోటర్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లల విషయంలోనే మొన్నీమధ్య ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వ, గవర్నర్ వ్యవస్థల మధ్య రాజీతో ఈ ఏడు బిల్లలకు కూడా ఆమోదం దక్కొచ్చన్నది ఓ వెర్షన్. మరోవైపు.. ఈ సెషన్ వరకే బహుశా రాజీ పడి ఉండొచ్చన్నది మరో వెర్షన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..