Cervical Cancer: స్త్రీలలో వచ్చే సర్వికల్ క్యాన్సర్ నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో బాలికలకు ఫ్రీ వ్యాక్సిన్

మహిళలల్లో ఎక్కువ శాతం మరణాలకు కారణం అవుతున్న క్యాన్సర్స్‌లో సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌) ఒకటి. దీన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు అందించనుంది.

Cervical Cancer: స్త్రీలలో వచ్చే సర్వికల్ క్యాన్సర్ నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో బాలికలకు ఫ్రీ వ్యాక్సిన్
Cervical Cancer
Follow us

|

Updated on: Jan 30, 2023 | 11:33 AM

మన దేశంలో రోజు రోజుకీ సర్వికల్ కాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. మహిళల్లో కనిపించే గర్భాశయయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవది కాగా భారత్‌లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ గర్భాశయ క్యాన్సర్ కు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలల్లో ఎక్కువ శాతం మరణాలకు కారణం అవుతున్న క్యాన్సర్స్‌లో సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌) ఒకటి. దీన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు అందించనుంది.

ఈ ఏడాది జూన్‌లో తొమ్మిది నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు జాతీయ రోగనిరోధకత కార్యక్రమంలో కేంద్రం HPV వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  9-14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ ను ఫ్రీగా వేయనున్నారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తిని ఆపడానికి HPV వ్యాక్సిన్ కీలకం… 16 కోట్ల డోసులకు ఏప్రిల్లో టెండర్ వెలువడనుంది. దేశంలో ఏటా 35 వేల మంది స్త్రీలు సర్వికల్ క్యాన్సర్ తో మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలికలకు HPV వ్యాక్సిన్లను ఇవ్వడం హర్షణీయమని అంటున్నారు.

అయితే ఇప్పటికే దేశంలోని ప్రతి జిల్లాలో 5 నుంచి 10వ తరగతి వరకు బాలికల సంఖ్యను క్రోడీకరించి ఆ లిస్ట్ ను అందించాలని  రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం కోరిన సంగతి తెలిసిందే. అయితే స్త్రీలలో ఎక్కువగా వచ్చే ఈ సర్వికల్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి సరైన చికిత్స ఇచ్చినట్లు అయితే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles