AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taraka Ratna: రేర్ డిసీజ్ మెలెనాతో బాధపడుతున్న తారకరత్న.. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటో తెలుసా

చిన్న వయసులోనే తారకరత్నకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదే అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం స్పెషలిస్ట్‌ల అబ్జర్వేషన్‌లో ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో ఆప్‌డేట్‌ అందింది. అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారని అక్కడి వైద్య బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది.

Taraka Ratna: రేర్ డిసీజ్ మెలెనాతో  బాధపడుతున్న తారకరత్న.. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటో తెలుసా
Taraka Ratna
Surya Kala
|

Updated on: Jan 30, 2023 | 7:46 AM

Share

నందమూరి తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉంది. బెంగళూరు నారాయణ హృదయాలయలో.. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. ఆస్పత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. కొద్దిసేపు పాదయాత్రలో నడిచిన తర్వాత తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అయితే 45 నిమిషాల సేపు ఆయనకు స్పృహ లేదని.. తర్వాత డాక్టర్లు ప్రయత్నించడంతో స్పృహలోకి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు.

అటు.. బెంగళూరుకు ఒకొక్కరుగా నందమూరి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. తారకరత్నను చూసేందుకు బెంగళూరు బయల్దేరి వెళ్లారు జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌. వీళ్లిద్దరితోపాటు కుటుంబ సభ్యులు కూడా బెంగళూరు వెళ్లారు. తారకరత్న పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు.

మెలెనాతో బాధపడుతున్న తారకరత్న

ఇవి కూడా చదవండి

చిన్న వయసులోనే తారకరత్నకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదే అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం స్పెషలిస్ట్‌ల అబ్జర్వేషన్‌లో ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో ఆప్‌డేట్‌ అందింది. అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారని అక్కడి వైద్య బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది.

వ్యాధి లక్షణాలు ఏమిటంటే

మెలెనా వ్యాధి కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. బ్లీడింగ్ కారణంగా పలు శరీర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయినట్లు చెప్పారు. తారకరత్న అధిక ఆయాసంతో బాధపడుతున్నట్లు చెప్పారు. సాధారణంగా మెలెనా వల్ల జీర్ణాశయం మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు వద్ద బ్లీడింగ్‌ అవుతుంటుంది.

కొన్ని సందర్భాల్లో జీర్ణాశయ మార్గం దెబ్బ తినడం, కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్త నాణాలు వాపు చెందడం రక్తస్రావం, రక్తసంబంధిత జబ్బుల వల్ల మెలెనా సంభవిస్తుంది.

మెలెనా వల్ల మలం నల్లగా, బంక మాదిరిగా ఉంటుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది. మెలెనా వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. బలహీనంగా మారిపోతారు. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతంది. శరీరం లేత రంగులోకి మారిపోతుంది.

అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. చిన్నపేగులో రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతుల లక్షణాలు కనిపిస్తాయి.

మెలెనా వల్ల కొన్నిసార్లు విపరీతమైన రక్తస్రావం జరగుతుంది. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుండి రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్త నాళాలలో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం కారణంగానే.. గుండెకు వైద్యం అందించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. ట్రీట్‌మెంట్‌ సమయంలో ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు.

తారకరత్న గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టతరంగా మారడంతో.. బెలూన్‌ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం దాదాపు 20 శాతం మెరుగుపడినట్లు తెలుస్తోంది. అంతా మంచే జరుగుతుందని, అభిమానుల ప్రార్థనలతో తారకరత్న తప్పకుండా కోలుకుని క్షేమంగా ఆస్పత్రినుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..