AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: చదువుకు ఫీజులు కట్టలేమన్న తల్లిదండ్రులు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న కూతురు

అచ్యుతాపురంలోని ఓ నర్సింగ్ కళాశాలలో ఎం పి హెచ్ డబ్ల్యు కోర్సు చదువుతుంది ధనలక్ష్మి. అయితే తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి కూతురు చదువుకు అడ్డంకిగా మారింది. ధనలక్ష్మి చదువుతున్న కాలేజికి ఫీజు కట్టలేమనీ, చదువు మానేయాలని తల్లిదండ్రులు సూచించారు.

Visakhapatnam: చదువుకు ఫీజులు కట్టలేమన్న తల్లిదండ్రులు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న కూతురు
Nursing Student
Surya Kala
|

Updated on: Jan 30, 2023 | 6:46 AM

Share

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మళ్లవరం లో విషాదం చోటు చేసుకుంది. కర్రి ధనలక్ష్మి అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అచ్యుతాపురం మండలం లోని మళ్లవరం గ్రామానికి చెందిన కర్రి ధనలక్ష్మి బీఎస్సీ నర్సింగ్ చేయాలని అనుకుంది. ఆ దిశగా చదువు ప్రారంభించింది. అచ్యుతాపురంలోని ఓ నర్సింగ్ కళాశాలలో ఎం పి హెచ్ డబ్ల్యు కోర్సు చదువుతుంది ధనలక్ష్మి. అయితే తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి కూతురు చదువుకు అడ్డంకిగా మారింది. ధనలక్ష్మి చదువుతున్న కాలేజికి ఫీజు కట్టలేమనీ, చదువు మానేయాలని తల్లిదండ్రులు సూచించారు. దీంతో తాను ఇక చదువుకోలేనని.. బి.ఎస్సీ.నర్సింగ్ కంప్లీట్ కాదని ఆలోచించింది. తన ఆశయం  నెరవేరదని భావించి ఆత్మహత్యకు పాల్పడింది ధనలక్ష్మి. ఈనెల 26వ తేదీన చీమలమందు తాగగా విశాఖలోని కె.జి.హెచ్.లో చికిత్సపొందుతూ మృతి చెందింది.

Reporter : khaja

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..