Fake police: సాగరతీరంలో నయా దందా.. ఏకాంతంగా గడిపే జంటలే టార్గెట్..! వైరల్ అవుతున్న వీడియో.
విశాఖలో ఒంటరి జంటలను టార్గెట్ చేస్తూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీస్ ఆటకట్టించారు స్థానికులు. ఓ జంట ఋషికొండ ప్రాంతంలో ఉండగా గుర్తించిన సునీల్ అనే నకిలీ పోలీస్..
విశాఖలో ఒంటరి జంటలను టార్గెట్ చేస్తూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీస్ ఆటకట్టించారు స్థానికులు. ఓ జంట ఋషికొండ ప్రాంతంలో ఉండగా గుర్తించిన సునీల్ అనే నకిలీ పోలీస్.. వారి దగ్గరకు వెళ్లి బెదిరించాడు. ఎనిమిది వేల నగదు లాక్కున్నాడు. అంతేకాదు స్నేహితుల ఏటీఎంల నుంచి మరో మూడు వేల నగదు లాగేసాడు. విషయం ఎవరికైనా చెబితే.. తాటతీస్తానని బెదిరించి అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో స్థానికుల సహకారంతో ఆ నకిలీ పోలీసులు పట్టుకున్నాడు ఆ యువకుడు. పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు. ఈ నకిలీ గాడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాడు. అయితే.. ఈ ఘటనపై కూపీలాగితే.. ఈ నకిలీ పోలీస్ సునీల్‌కు మరో ఏ ఆర్ కానిస్టేబుల్ సహకారం అందిస్తున్నట్టు ప్రాథమికంగా విచారణలో తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..