Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Couples Fight: భార్యాభర్తల మధ్య గొడవలు.. షిఫ్ట్‌లు వారీగా పనులు.. అర్ధరాత్రి మంచం కోసం కొట్టుకున్న కపుల్స్..

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బొరివ్లీ ఏరియా రాంబాగ్‌ లేన్‌కు చెందిన ఓ జంట మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో తనకు విడాకులు కావాలని భార్య కోరింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. దాంతో ఇద్దరికీ క్షణం పడకపోయినా ఒకే ఇంట్లో ఉంటున్నారు.

Couples Fight: భార్యాభర్తల మధ్య గొడవలు.. షిఫ్ట్‌లు వారీగా పనులు.. అర్ధరాత్రి మంచం కోసం కొట్టుకున్న కపుల్స్..
Maharashtra Couples Fight
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2023 | 12:19 PM

భార్యభర్తల మధ్య గొడవలకు ప్రత్యేకమైన కారణాలేవీ ఉండవు. భార్య వండినవి టేస్టీగా లేదనో.. భర్త పక్కింటి అమ్మాయిని చూసాడనో గొడవలు తలెత్తుతూనే ఉంటాయి. కొని సార్లు ఈ గొడవలు చిలిపిగా సరదాగా ఉంటే.. మరికొన్ని సార్లు అదుపు తప్పుతాయి. ఇదిలా ఉంటే.. ముంబైలోని ఓ జంట మధ్య మాత్రం ఒక విచిత్రమైన కారణంతో గొడవ జరిగింది. చివరకు భర్తను కటకటాలపాలు చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బొరివ్లీ ఏరియా రాంబాగ్‌ లేన్‌కు చెందిన ఓ జంట మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో తనకు విడాకులు కావాలని భార్య కోరింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. దాంతో ఇద్దరికీ క్షణం పడకపోయినా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ చెరిసగం పంచుకొని షిఫ్ట్‌లు వారీగా పనులు చేసుకుంటున్నారు. అన్నీ పంచుకోగలరు కానీ టీవీని, మంచాన్ని పంచుకోలేరు కదండీ… అందుకని వారి బెడ్‌ని కూడా గంటల వారీగా షేర్‌ చేసుకున్నారు.

ఈ క్రమంలో జనవరి 28న భర్త రాత్రి ఒంటిగంట సమయంలో భార్యను నిద్ర లేపాడు. తను రెస్ట్‌ తీసుకోవాలని, మంచం కావాలని కోరాడు. అందుకు ఆమె ఇది టైమ్‌.. నేను లేవను పొమ్మంది. దాంతో చిర్రెత్తిన భర్త ఆమె చెంప మీద కొట్టాడు. ఈ క్రమంలో ఆమె గూబ గుయ్‌మని.. వినికిడి కోల్పోయింది. వెంటనే ఆమ తన స్నేహితురాలికి ఫోన్‌ చేసి ఆమె సహాయంతో ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షచేసిన వైద్యులు లోపలి చెవి దెబ్బతిందని చెప్పారు. అంతే ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై కేసుపెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 325 కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి తాము భర్తపై కేసు నమోదు చేశామని, అతడిని కస్టడీలోకి తీసుకున్నామని, కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. అందుకే భార్యపై చేయి చేసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..