Ram Janmabhoomi: రామమందిర సముదాయానికి బాంబు బెదిరింపు.. అయోధ్యలో హై అలర్ట్.. భద్రత మరింత కట్టుదిట్టం

రామ్‌కోట్ ప్రాంతంలోని రాంలాల్లా సదన్ ఆలయానికి సమీపంలో నివసిస్తున్న స్థానికుడు ఆలయ సముదాయాన్ని పేల్చివేస్తానని తనకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. బెదిరించాడని చెప్పాడు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేశాడు.

Ram Janmabhoomi: రామమందిర సముదాయానికి బాంబు బెదిరింపు.. అయోధ్యలో హై అలర్ట్.. భద్రత మరింత కట్టుదిట్టం
Up Ram Janmabhoomi Complex
Follow us
Surya Kala

|

Updated on: Feb 11, 2023 | 10:19 AM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ వైపు రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మరోవైపు రామజన్మభూమి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. తాను  రామజన్మభూమి కాంప్లెక్స్‌ని పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తి  బెదిరింపు కాల్ చేశాడు. నివేదికల ప్రకారం.. రామ్‌కోట్ ప్రాంతంలోని రాంలాల్లా సదన్ ఆలయానికి సమీపంలో నివసిస్తున్న స్థానికుడు ఆలయ సముదాయాన్ని పేల్చివేస్తానని తనకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. బెదిరించాడని చెప్పాడు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేశాడు. గురువారం ఉదయం 10 గంటలకు ఆలయ సముదాయాన్ని పేల్చివేస్తానని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడని మనోజ్ అనే నివాసి పోలీసులకు చెప్పాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మనోజ్‌కి కాల్‌ వచ్చింది. తాను ఢిల్లీ నుండి ఫోన్ చేస్తున్నానని.. అయోధ్యలో రామజన్మభూమి కాంప్లెక్స్‌ను ఆలయ సముదాయాన్ని   ఉదయం 10 గంటలకు పేల్చివేస్తానని చెప్పాడు. దీంతో అలెర్ట్ అయిన మనోజ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు.. ఆలయ సముదాయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్తు తెలియని వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసుల బృదం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అయోధాలోని రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చివేస్తామని బెదిరింపు కాల్ వచ్చిందని యూపీ పోలీసులు తెలిపారు

ఇవి కూడా చదవండి

ఇప్పటికే అయోధ్యలోని రామమందిరం కోసం రెండు శాలిగ్రామ బండలు నేపాల్ నుండి గోరఖ్‌పూర్ చేరుకున్నాయి. ఈ రాళ్లను రాముడు, సీతమ్మ తల్లి విగ్రహాల నిర్మాణానికి ఉపయోగించనున్నట్లు సమాచారం. స్థానికులు శాలిగ్రామాలను పూలమాలలతో అలంకరించి ఆలయ అధికారులకు అందజేసారు. ఈ రాళ్లతో నిర్మించిన విగ్రహాలను ప్రధాన ఆలయ సముదాయంలో ప్రతిష్టించనున్నారు. ఈ శాలిగ్రామాలు నేపాల్‌లోని కాళి గండకీ నది ఒడ్డున మాత్రమే కనిపిస్తాయి. జనవరి 2024లో రామమందిరాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..