ఇదో సరికొత్త క్రైమ్ కథా చిత్రమ్.. పెళ్లైన 14ఏళ్లకు 15 లక్షలు ఖర్చు చేసి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. చివరకు

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ.. పెళ్ళైన 14 ఏళ్ల తర్వాత తల్లయింది. ఇందుకోసం ఆమె లక్షలు ఖర్చు చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. పుట్టిన శిశువు అకస్మాత్తుగా మరణించింది. దీంతో ఆ తల్లి కిడ్నప్ డ్రామా ఆడింది. తర్వాత పోలీసులకు చిక్కింది.

ఇదో సరికొత్త క్రైమ్ కథా చిత్రమ్.. పెళ్లైన 14ఏళ్లకు 15 లక్షలు ఖర్చు చేసి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. చివరకు
Uttar Pradesh
Follow us

|

Updated on: Feb 09, 2023 | 8:23 AM

పెళ్ళైన ప్రతి స్త్రీ తాను తల్లి కావాలని అమ్మదనంలోని కమ్మదనం అనుభవించాలని భావిస్తుంది. అందుకోసం తపిస్తుంది. ఏ కారణం వలన అయిన తల్లిదండ్రులు కావడానికి ఆలస్యం అయితే… ఆ దంపతులు పడే తపన గురించి ఎంత చెప్పినా తక్కువే.. వైద్యులను సంప్రదిస్తారు. గుడులు గోపురాలను దర్శించుకుంటారు. ఇదే విధంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ.. పెళ్ళైన 14 ఏళ్ల తర్వాత తల్లయింది. ఇందుకోసం ఆమె లక్షలు ఖర్చు చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. పుట్టిన శిశువు అకస్మాత్తుగా మరణించింది. దీంతో ఆ తల్లి కిడ్నప్ డ్రామా ఆడింది. తర్వాత పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఓ మహిళ పెళ్ళై  14 ఏళ్ళైనా తల్లి కాలేదు. దీంతో 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓ చిన్నారికి జన్మనిచ్చింది. తల్లి అయింది. అయితే అమ్మదనంలోని ఆనందాన్ని ఎంతో కాలం పొందలేదు. పాలిస్తుండగా చిన్నారి బాలిక అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో ఆ తల్లి కంగారు పడింది. చిన్నారి మృతదేహాన్ని ఇంటి పైకప్పు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌లో దాచిపెట్టింది. తర్వాత చిన్నారి కిడ్నాప్‌ అయింది అంటూ ఓ కథ అల్లింది. పోలీసులు చిన్నారి కోసం . వెదికారు. కొన్ని గంటల తర్వాత నీటి ట్యాంక్‌లో మృతదేహం లభ్యమైంది. పోలీసుల విచారణలో.. తల్లి అసలు నిజం చెప్పింది. తాను శిశువుకు పాలు ఇస్తున్న సమయంలో  పాలు  శ్వాసనాళంలోకి ప్రవేశించి బిడ్డ చనిపోయిందని చెప్పింది.  భయంతో మృతదేహాన్ని దాచిపెట్టినట్లు అంగీకరించింది.

పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే సవితకు 14 సంవత్సరాల క్రితం సరాయ్ అకిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవినాష్‌తో వివాహం జరిగింది. పెళ్లయి 14 ఏళ్లు గడిచినా సవితకు సంతానం కలగలేదు. దీంతో భార్యాభర్తలు IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ .. టెస్ట్ ట్యూబ్ బేబీ) ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని భావించారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రిలో 15 లక్షలు ఖర్చు చేసి.. సవిత IVF ద్వారా తల్లి అయ్యింది. సవిత తన ఒకటిన్నర నెలల కుమార్తెతో తన తల్లి ఇంట్లో నివసిస్తుంది. భర్త ఉద్యోగం నిమిత్తం ఢిల్లీ వెళ్లాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత సవిత తన నెలన్నర కుమార్తెతో కలిసి నిద్రిస్తుంది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సవిత కళ్లు తెరిచి చూసేసరికి చిన్నారి కనిపించలేదు. ఇంట్లో వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు తన కూతురు కిడ్నాప్ అయిందని ఫిర్యాదు చేసింది. వెంటనే పిప్రి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెదకడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

నీటి ట్యాంక్‌లో మృతదేహం..  గంటల తరబడి పోలీసులు వెతికిన తర్వాత ఇంటి పైకప్పులో ఉన్న వాటర్ ట్యాంక్ లో చిన్నారి బాలిక మృతదేహం లభ్యమైంది.  పోలీసులు విచారణ ప్రారంభించగా.. తల్లి సవిత తన బిడ్డ మృత దేహాన్ని వాటర్ ట్యాంక్‌లో దాచిపెట్టినట్లు అంగీకరించింది.

నకిలీ కిడ్నాప్ కథ అకస్మాత్తుగా కూతురు చనిపోవడంతో భయాందోళనకు గురైన తల్లి సవిత.. అత్తమామలు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆడపిల్లను ఎత్తుకెళ్లినట్లు తప్పుడు కథనం సృష్టించింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బ్రిజేష్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తల్లిపై హత్య, సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..