- Telugu News Photo Gallery Here are the list of earthquake prone cities in India such as Mumbai Delhi and more
Earthquake Risk Cities: భారత్‌లో భూకంపం రిస్క్ ఎక్కువగా ఉన్న నగరాలు ఇవే..
Earthquake Risk Cities In India: టర్కీ, సిరియా దేశాలలో ఇటీవలే సంభవించిన భూకంపాలు మానవ మనుగడను మరోసారి ప్రశ్నార్థకం చేశాయి. ఆనందంగా సాగిపోతున్న జీవితం తలకిందులు అవ్వడానికి ఒక్క క్షణం చాలని టర్కీ, సిరియా భూకంపాలు మరోసారి నిరూపించాయి. మరి ఈ నేపథ్యంలో మన దేశంలోని సిస్మిక్ జోక్ పరిధిలో ఉన్న నగరాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 09, 2023 | 8:10 AM

శ్రీనగర్: కశ్మీర్ లోయలోని సోయగాలన్నింటినీ తనలోనే నింపుకున్న శ్రీనగర్ భూకంపం ముప్పు పరంగా జోన్ 5 పరిధిలోకి వస్తుంది.

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై సీస్మిక్ జోన్ 3 కిందకు వస్తుంది. ఈ కారణంగానే భూకంపం రిస్క్ ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో ముంబై కూడా ఒకటిగా ఉంది. పైగా ముంబైకి పొంచి ఉన్న మరో ముప్పు ఏంటంటే.. నగరాన్ని ఆనుకునే సముద్రతీరం కూడా ఉండటంతో ఒకవేళ ముంబైలో భూకంపం సంభవిస్తే.. ఆ తరువాత సునామి కూడా వచ్చే ప్రమాదం ఉందని భూగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గువాహటి: అస్సాం రాజధాని గువహటి సీస్మిక్ జోన్ 5 కిందకు వస్తుంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా గువహటిలో భూకంపం అంటూ వస్తే.. దాని దుష్పరిణామాలు అంతే తీవ్రంగా ఉంటాయనేది శాస్త్రవేత్తల అంచనా.

ఢిల్లీ: దేశంలో అత్యంత ఎక్కువ భూకంపం రిస్క్ ఉన్న నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ అన్నింటికంటే ముందు ఉంటుంది. ఆఫ్గనిస్థాన్‌లోని హిందూ ఖుష్ పర్వతాల నుంచి మొదలుకుని పాకిస్థాన్, నేపాల్ వరకు ఎక్కడ భూకంపం సంభవించినా.. వాటి ప్రకంపనలు ఢిల్లీని తాకుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగానే ఢిల్లీలో తరచుగా భూకంపం సంభవిస్తుండటం వార్తల్లో చూస్తున్నాం.

చెన్నై : బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తమిళనాడు రాజధాని చెన్నైకి కూడా భూకంపం ముప్పు పొంచి ఉంది. చెన్నై కూడా సీస్మిక్ జోన్ 3 పరిధిలోకి వస్తుంది.





























