- Telugu News Photo Gallery Take these 5 juices which helps to avoid eyesight and eye related problems
Eyecare: కంటిచూపును కాపాడుకోవాలంటే.. తప్పక తీసుకోవలసిన ఆహారాలివే.. వాడితే కళ్లజోడుకు బాయ్ చేప్పేయోచ్చు..
ప్రస్తుతం అన్ని పనులు సెల్‌ఫోన్.. ఇంకా ప్రధానంగా కంప్యూటర్ల ద్వారానే పూర్తవుతున్నాయి. అయితే ఎక్కువ సమయాన్ని ఈ గాడ్జెట్‌లపై వెచ్చించడం వల్ల మన కళ్ళు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ క్రమంలోనే కంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య, పోషకాహారం అవసరం. వీటిని తీసుకోవడం ద్వారా అనతి కాలంలోనే కళ్లజోడును కూడా వదిలేయోచ్చనేది నిపుణుల సూచన.
Updated on: Feb 11, 2023 | 7:46 AM

జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్‌లోని ఒక అధ్యయనం ప్రకారం కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడపడం మీ కళ్ళకు ప్రాణాంతకం. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన పోషకాహారం అవసరం. ఈ క్రమంలో కంటిచూపు సంరక్షణ కోస మీరు పండ్లు, కూరగాయల రసాలను త్రాగవచ్చు.

కొబ్బరి నీటిలో విటమిన్ సి, ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పాటు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కళ్ళ సంరక్షిత కణజాలాలను మెరుగుపరచడంలోఎంతగానో సహాయపడుతుంది.

ఆరెంజ్ జ్యూస్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి ప్రధాన వనరులలో ఆరెంజ్ ఒకటి. ఈ జ్యూస్ తాగడం వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాంటీఆక్సిడెంట్స్‌కు మంచి మూలం. ఇవి మన కళ్ళకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి కంటిపై పడే హానికరమైన కాంతి కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

కళ్లకు కావాల్సిన పోషకాలు చాలా వరకు టమోటా రసంలో ఉంటాయి. టమాటాలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం వంటి పలు పోషకాలు మన కంటి చూపును పెంచడంలో ఇంకా కాపాడడంలో సహాయపడతాయి.





























