Brahmani- Lakshmi Pranathi: ఒకే ఫ్రేమ్‌లో బ్రాహ్మణి- లక్ష్మీ ప్రణతి.. నారా – నందమూరి ఫ్యాన్స్‌కు కనులవిందే..
నీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫార్ములా-ఇ రేసింగ్‌ను సందర్శించారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఫార్ములా ఈ- కార్ రేసింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ రేసింగ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కాగా ప్రధాన రేస్ శనివారం, ఆదివారాల్లో (ఫిబ్రవరి 11, 12) జరగనుండగా, శుక్రవారం (ఫిబ్రవరి 10)న ప్రీ ప్రాక్టీస్ రేస్‌ను నిర్వహించారు. మొత్తం 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు ఈ ప్రీ రేస్ లో పాల్గొన్నారు. ఈ ఫార్ములా రేసింగ్ ప్రమోషన్స్ కోసం సినీతారలు సైతం దిగి వచ్చి అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫార్ములా-ఇ రేసింగ్‌ను సందర్శించారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. కాగా నారావారి కోడలు బ్రాహ్మణి, నందమూరి కోడలు లక్ష్మీ ప్రణతి ఒకేచోట కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరూ దగ్గరి బంధులువైనా కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఇద్దరూ ఒకేచోట కనువిందు చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
కాగా బ్రాహ్మణి కొడుకు దేవాన్ష్ తో కలిసి హాజరుకాగా, లక్ష్మీ ప్రణతి ఒంటరిగానే విచ్చేసింది. సాధారణంగా తారక్ లేకుండా ప్రణతి బయట ఎక్కువ కనిపించదు. ప్రస్తుతం నారా బ్రాహ్మణి- లక్ష్మీ ప్రణతిల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ రేసింగ్ ఈవెంట్‌లో మహేశ్ సతీమణి నమ్రత కూడా తళుక్కుమన్నారు. ‘నాకు రేసింగ్ అంటే పెద్దగా ఇష్టముండదు. అయితే నా కొడుకు గౌతమ్ కు బాగా ఇష్టమని రేస్ చూడడానికి వచ్చాను. హైదరాబాద్ లో ఫార్ములా ఇ రేసింగ్ నిర్వహించడం గ్రేట్’ అని చెప్పుకొచ్చింది నమ్రత.
Young Tiger Bhargava Ram ? Side please ? pic.twitter.com/SE3041hwPP
— Chittoor District NTRFans (@ChittoorNTRFans) February 11, 2023
#NamrataMaheshGhattamaneni visited the Necklace Road to watch the Formula E practice race.#FormulaE Race ?️ to happen tomorrow in Hyderabad!#GreenkoHyderabadEPrix @KTRBRS pic.twitter.com/u02iecyqdR
— SSMB Space ? (@SSMBSpace) February 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..