కిర్రాక్ ఆర్పీ అసలు తగ్గట్లేదుగా!! నెల్లూరు చేపల పులుసు రెండో బ్రాంచ్ ప్రారంభం.. సందడి చేసిన హైపర్ ఆది, హేమ
బిజినెస్‌లో బాగా లాభాలు వచ్చాయేయో తాజాగా మణికొండలో సైతం రెండో బ్రాంచిని ఏర్పాటుచేశాడు. ఈ ఓపెనింగ్‌కు ఆర్పీ పట్నాయక్, హేమ వంటి సినీ ప్రముఖులతో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శాంతి వంటి జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు.
ఏముహూర్తాన కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రారంభించాడో కానీ గత కొన్ని రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. మొదట కూకట్ పల్లిలో ప్రారంభమైన ఈ కర్రీ సెంటర్‌కు నగరవాసుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్లను కంట్రోల్ చేయడానికి కర్రీ పాయింట్‌లో ఏకంగా బౌన్సర్లను నియమించుకోవాల్సి వచ్చింది. అయితే ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తడంతో ప్రారంభించిన కొన్ని రోజులకే చేపల పులుసు సెంటర్ క్లోజ్ అయ్యింది. అయితే వెంటనే నెల్లూరు వెళ్లి అక్కడి మహిళలను తీసుకొచ్చి కొత్త ఉత్సాహంతో మళ్లీ కర్రీపాయింట్‌ను ఓపెన్ చేశాడు. బిజినెస్‌లో బాగా లాభాలు వచ్చాయేయో తాజాగా మణికొండలో సైతం రెండో బ్రాంచిని ఏర్పాటుచేశాడు. ఈ ఓపెనింగ్‌కు ఆర్పీ పట్నాయక్, హేమ వంటి సినీ ప్రముఖులతో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శాంతి వంటి జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు. ఇందులో స్పెషాలిటీ ఏం లేదు కానీ.. హైపర్ ఆది ఈ కార్యక్రమానికి రావడమే చర్చనీయంశమైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆర్పీ- ఆది మధ్య టర్మ్స్ అంతగా బాగోలేవు.
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక కిరాక్ ఆర్పీ అదిరింది లాంటి ఈవెంట్లలో సందడి చేశాడు. ఇదే క్రమంలో జబర్దస్త్ షోకు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ చేసినప్పుడు మొదట స్పందించింది హైపర్ ఆదినే. కిర్రాక్ ఆర్పీ ప్రశ్నలకు మేం ఆన్సర్ చెబుతామంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో వారి మధ్య కాస్త దూరం వచ్చింది. అయితే ఈ గొడవలన్నీ మర్చిపోయి హైపర్ ఆది ఆర్పీ చేపల పులుసు ఓపెనింగ్ కి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు కనిపించడంపై వారి ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ గొడవలు మర్చిపోయి ఇద్దరూ కలిసిపోవడం బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..