Kriti Sanon: ‘నేను ఇది అస్సలు ఊహించలేదు’.. విమర్శలపై స్పందించిన కృతి సనన్..

విమర్శలను తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని.. ప్రజల అభిప్రాయలను వినాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.

Kriti Sanon: 'నేను ఇది అస్సలు ఊహించలేదు'.. విమర్శలపై స్పందించిన కృతి సనన్..
Kriti Sanon
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 10, 2023 | 7:07 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి కనిపించనుండగా.. రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. అయితే ఇప్పటికే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది. టీజర్ అస్సలు బాలేదని.. రాముడు.. రావణుడి పాత్రలు.. కస్ట్యూమ్స్ సరి కాదంటూ విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా వీఎఫ్ఎక్స్ ఎక్కువైందంటూ ట్రోల్స్ జరిగాయి. ఈ క్రమంలో వెంటనే మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాజాగా ఆదిపురుష్ టీజర్ ట్రోల్స్ పై స్పందించింది కృతి. విమర్శలను తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని.. ప్రజల అభిప్రాయలను వినాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.

డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గతంలో విడుదలైన టీజర్ పై ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే గతంలో టీజర్ పై వచ్చిన విమర్శలు.. ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు కృతి. “సహజంగానే ఈ విమర్శలు టీజర్ పై ప్రతికూల ప్రభావం చూపించాయి. కానీ ఇది నేను అస్సలు ఊహించలేదు. కానీ మేకర్స్ వాటిని స్పూర్తితో తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను తీసుకువాలని నేను భావిస్తున్నాను. మీరు వినండి ఎంతవరకు నిజమో తెలుస్తోంది. అందుకు అవసరమైతే దిద్ధుబాట్లు చేయండి” అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ప్రభాస్, కృతి సనన్ గురించి నెట్టింట అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని.. కేవలం రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది ప్రభాస్ టీం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే