Tamannaah: ఆధ్యాత్మిక సేవలో తమన్నా.. లింగ భార్గవి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. సమంత రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉందని టాక్ నడుస్తోంది. న్యూయర్ వేడుకలలో భాగంగా గోవాలో వీరిద్దరు కలిసున్న పిక్ నెట్టింట వైరల్ కావడంతో వీరి ప్రేమాయణంకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై తమన్నా స్పందించేలేదు. తాజాగా ఈ అమ్మడు ఆధ్యాత్మిక సేవలో తరిస్తోంది. ఆలయాల చుట్టూ తిరుగుతూ.. పూజలు చేస్తూ కనిపిస్తోంది.

Tamannaah: ఆధ్యాత్మిక సేవలో తమన్నా.. లింగ భార్గవి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. సమంత రియాక్షన్ ఏంటంటే..
Samantha, Tamannah
Follow us

|

Updated on: Feb 08, 2023 | 5:18 PM

ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తున్న కుర్రహీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది మిల్కీబ్యూటీ తమన్నా. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఈ చిన్నది.. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్న మిల్కీబ్యూటీ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది. కొద్దిరోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే కొన్ని నెలలుగా మిల్కీబ్యూటీ ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉందని టాక్ నడుస్తోంది. న్యూయర్ వేడుకలలో భాగంగా గోవాలో వీరిద్దరు కలిసున్న పిక్ నెట్టింట వైరల్ కావడంతో వీరి ప్రేమాయణంకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై తమన్నా స్పందించేలేదు. తాజాగా ఈ అమ్మడు ఆధ్యాత్మిక సేవలో తరిస్తోంది. ఆలయాల చుట్టూ తిరుగుతూ.. పూజలు చేస్తూ కనిపిస్తోంది.

షూటింగ్స్ లేని సమయంలో ఆలయాలు తిరుగుతూ.. పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక బాట పట్టింది. తాజాగా ఈశా యోగా ప్రాంగణానికి కాషాయ దుస్తుల్లో వెళ్లి అక్కడ ఉన్న లింగభైరవి దేవిని దర్శించుకుంది. అమ్మవారికి హరతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈశా యోగాశ్రమం నుంచి ఆహ్వానం రావడంతో ఎంతో సంతోషానికి గురయ్యానని చెప్పింది. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మానసిక ఉల్లాసాన్ని కలిగించిందని తెలిపింది. అంతేకాకుండా.. జీవితంలో భయం, అపజయాల గురించి ఆందోళన దూరమవుతుందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

లింగభైరవి విగ్రహాన్ని తన ఇంటికి తీసుకెళ్తానని.. అక్కడి పరిసరాలు.. లింగ భైరవి మూర్తీభం చూడగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతికి లోనైనట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే తమన్నా షేర్ చేసిన వీడియోపై హీరోయిన్ సమంత రియాక్ట్ అయ్యింది. బైరవిదేవి అంటూ దండం పెడుతున్న ఎమోజీని కామెంట్ చేసింది. అయితే ఈశా ఫౌండేషన్ కు సామ్ కూడా ఎక్కువగా వెళ్తుందన్న సంగతి తెలిసిందే. ఇటీవల శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో కనిపించిన సామ్.. చేతిలో జపమాల.. చేతికి ఉంగరాలతో ఆధ్యాత్మికంగా కనిపించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.