Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరోపై నెటిజన్స్ ఫైర్.. క్షమాపణ చెప్పాలంటూ నెట్టింట డిమాండ్..

తాజాగా మరోసారి ఈ స్టార్ హీరోపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలను చెప్పాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ అక్షయ్ చేసిన పొరపాటు ఏంటో తెలుసా ?.

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరోపై నెటిజన్స్ ఫైర్.. క్షమాపణ చెప్పాలంటూ నెట్టింట డిమాండ్..
Akshay Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 07, 2023 | 3:04 PM

బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. ఈ హీరోకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… స్వయం కృషితో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. సూపర్ హిట్ చిత్రాలతో కేవలం ఉత్తరాదిలోనే కాకుండా.. దక్షిణాదిలోనూ భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా ఈ స్టార్ హీరో నటిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకులేదు. అంతేకాకుండా.. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా మరోసారి ఈ స్టార్ హీరోపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలను చెప్పాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ అక్షయ్ చేసిన పొరపాటు ఏంటో తెలుసా ?.

అక్షయ్ కుమార్ తన ఉత్తర అమెరికా టూర్ ను ప్రమోట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. “ఉత్తర అమెరికాలోని ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని పంచేందుకు ది ఎంటర్టైనర్స్ వాళ్లు సిద్ధంగా ఉన్నారు. మీరంతా సీట్ బెల్టు పెట్టుకుని ఉండండి. మేము మార్చిలో మీ ముందుకు వస్తున్నాం” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో అక్షయ్ తోపాటు.. దిశాపటానీ, నోరా ఫతేహీ, మౌనీరాయ్ కీలకపాత్రలలో కనిపించారు. అందులో వీరంతా షూ వేసుకుని గ్లోబ్ పై నడుస్తూ ఉన్న ఈ ప్రమోషనల్ వీడియో క్షణాల్లో తెగ వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ వీడియోపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. భాయ్ ఇలా షూ వేసుకుని మనదేశ మ్యాప్ పై నడవడానికి సిగ్గుగా అనిపించడం లేదా .. దేశాన్ని కాస్తయినా గౌరవించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మీరు చేసిన పనికి భారతీయులందరికీ క్షమాపణలు చెప్పండి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సెల్ఫీ, ఓ మై గాడ్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?