AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhanupriya: భానుప్రియకు అరుదైన వ్యాధి.. అయ్యో ఇలా అయిపోయిందేంటీ..

కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కొద్దిరోజులుగా ఆమె సినిమాలు ఒప్పుకోలేదట. ఇందుకు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు నిజమని అన్నారు.

Bhanupriya: భానుప్రియకు అరుదైన వ్యాధి.. అయ్యో ఇలా అయిపోయిందేంటీ..
Bhanupriya
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2023 | 12:27 PM

Share

కలువ పువ్వుల్లాంటి నయనాలు.. నాట్యంతో మైమరపించే మయూరమే ఆమె. అందం.. అభినయంతో తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ భానుప్రియ. ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఆ తర్వాత సహయపాత్రలలోనూ మెప్పించింది. తల్లిగా.. వదినగా.. అక్కగా ఎన్నో చిత్రాల్లో కనిపించారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపైన కూడా పలు ధారవాహికలలో కనిపించారు. గతేడాది వరకు సిల్వర్ స్క్రిన్ పై నటనతో ప్రేక్షకులను అలరించారు భానుప్రియ. అయితే కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కొద్దిరోజులుగా ఆమె సినిమాలు ఒప్పుకోలేదట. ఇందుకు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు నిజమని అన్నారు.

క్లాసికల్ డాన్స్‏తో ఆడియన్స్‏ను అలరించిన ఆమె.. గతంలో ఓ డాన్స్ స్కూల్ పెడదామని అనుకున్నారట. కానీ ఐదేళ్ల క్రితం ఆమె భర్త ఆదర్శ్ కౌశల్ కన్నుమూడయంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ల నుంచి ఆరోగ్యం బాగుండడం లేదని.. మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. “ఈ మధ్య కాలంలో నాకు ఒంట్లో బాగోలేద. మెమరీ పవర్ తగ్గిపోయింది. నేర్చుకున్న కొన్ని ఐటమ్స్ మర్చిపోయాను. తర్వాత డాన్స్ మీద ఆసక్తి తగ్గింది. ఇంట్లో కూడా నేను డాన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు ” అన్నారు.

గత రెండేళ్లుగా మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నానని.. ఈ మధ్య ఒక సినిమా షూటింగ్ సమయంలో డైలాగ్స్ కూడా మర్చిపోయాయని అన్నారు. సిల నేరంగిలిల్ సిల మనిధర్గల్ అనే తమిళ సినిమాలో యాక్ట్ చేశాను. లొకేషన్‌లోకి వెళ్లి యాక్షన్ అనగానే డైలాగులన్నీ మరిచిపోయాను. మైండ్ బ్లాంక్ అయిపోయింది. మళ్లీ నేను సర్దుకున్నాక షూట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఎలాంటి ఒత్తిడికి కానీ, డిప్రెషన్‌కు కానీ లోనుకావడం లేదని స్పష్టం చేసిన భానుప్రియ.. ఆరోగ్యం బాగోకపోవడం వల్లే మరిచిపోతున్నానని అన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.