AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameera Reddy: ‘మహేష్ బాబు సినిమా ఆడిషన్‏కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశాను’.. హీరోయిన్ సమీరా రెడ్డి షాకింగ్ పోస్ట్..

ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న సమీరా.. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు.. కెరీర్ కు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తుంది. అలాగే తాను ప్రెగ్నేన్సీ సమయంలో లావుగా మారడంతో ఎన్నో ట్రోల్ ఎదుర్కొన్నానని.

Sameera Reddy: 'మహేష్ బాబు సినిమా ఆడిషన్‏కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశాను'.. హీరోయిన్ సమీరా రెడ్డి షాకింగ్ పోస్ట్..
Sameera Reddy
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2023 | 12:53 PM

Share

బాలీవుడ్ హీరోయిన్ సమీరారెడ్డి.. నరసింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆశోక్ చిత్రంలో సక్సెస్ అందుకుంది. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఆమెకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న సమీరా.. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు.. కెరీర్ కు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తుంది. అలాగే తాను ప్రెగ్నేన్సీ సమయంలో లావుగా మారడంతో ఎన్నో ట్రోల్ ఎదుర్కొన్నానని.. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా శ్రమించానని చెప్పుకొచ్చారు. తాజాగా సమీరా తన కెరీర్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

గతంలో తాను సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆడిషన్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అందులో సరిగా చేయలేక ఆరోజు కన్నీళ్లతో ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది. “నా మొట్ట మొదటి సినిమా ఆడిషన్ 1998లో జరిగింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం. ఆరోజు చాలా భయంతోనే ఉన్నాను. వాళ్లు ఇచ్చిన టాస్క్ చేయలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. అప్పటివరకూ ఏదైతే డెస్క్ జాబ్ చేశానో మళ్లీ అదే కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత కొద్దిరోజులకు ధైర్యం చేసుకుని మొదటిసారి ప్రైవేట్ ఆల్బమ్ కోసం కెమెరా ముందుకు వచ్చాను. ” అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. అయితే సమీరా చేసిన పోస్ట్ ఇఫ్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

సమీరా వెళ్లింది రాజకుమారుడు సినిమా కోసమే అని… అప్పటి విషయం ఇప్పుడెందుకు చెప్తున్నారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమీరా 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..