K Viswanath- Kamal Haasan: కళాతపస్వి సృష్టించిన కళ.. చిరకాలం జీవిస్తుంది.. సెల్యూట్ మాస్టర్ అంటూ కమల్ హాసన్ భావోద్వేగ పోస్ట్..
కళాతపస్వితో తమకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ నోట్ చేశారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ భావోద్వేగ పోస్ట్ చేశారు.
తెలుగు చిత్రపరిశ్రమలో అద్భుతమైన చిత్రాలను రూపొందించి.. తెలుగు సినిమాకు గౌరవాన్ని.. గుర్తింపును తీసుకువచ్చిన దర్శకులు కాశీనాధుని విశ్వనాధ్. సౌండ్ రికార్డిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ప్రశస్తమైన సినిమాలను సృష్టించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కె. విశ్వనాధ్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కళాతపస్విని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఆయన నివాసానికి వెంకటేశ్, మణిశర్మ, గుణశేఖర్, త్రివిక్రమ్, సాయి కుమార్ వంటి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఇప్పటికే కళాతపస్వితో తమకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ నోట్ చేశారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ భావోద్వేగ పోస్ట్ చేశారు.
కమల్ హాసన్, విశ్వనాథ్ కాంబోలో సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. “కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు జీవిత పరమార్థం, కళలకు ఉండే అమరత్వం గురించి ఎంతో అర్ధం చేసుకున్నారు. అందుకే ఆయన కళాతపస్వి సృష్టించిన కళ. ఆయన జీవితకాలానికి మించి మరణానంతరం కూడా ఓ వేడుకలా సాగుతుంది. కళలు చిరకాలం కొనసాగుతుంటాయి. సెల్యూట్ మాస్టర్” అంటూ పోస్ట్ చేశారు.
తెలుగు చిత్రపరిశ్రమలో వీరిద్దరి కాంబినేషన్ ప్రత్యేకం. వీరి కలయికలో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలు కమల్ హాసన్ కెరీర్లోనే ది బెస్ట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ మూడు సినిమాల్లో కమల్ నటనకు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయింది. అలాంటి అద్భుతమైన పాత్రలను సృష్టిండంలో విశ్వనాథ్ ప్రత్యేకతను తెలుసుకోవచ్చు.
Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM
— Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.