AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: ఎన్టీఆర్ పక్కన అమాయకంగా కనిపిస్తోన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి.. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్..

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ తర్వాత స్టోరీ ఎంపికలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఆ తర్వాత వరుస డిజాస్టర్స్ అందుకున్నారు. ఎవరో గుర్తుపట్టండి.

NTR: ఎన్టీఆర్ పక్కన అమాయకంగా కనిపిస్తోన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి.. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్..
Actor
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2023 | 12:05 PM

Share

నందమూరి తారకరామారావు నటవారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నది బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గురించి. హీరోగా ఆయన అరంగేట్రం గురించి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక నందమూరి వంశంలో పలువురు హీరోస్ కూడా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు సక్సెస్ అయితే…మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. ఎన్టీఆర్ పక్కన అమాయకంగా కనిపిస్తోన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ తర్వాత స్టోరీ ఎంపికలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఆ తర్వాత వరుస డిజాస్టర్స్ అందుకున్నారు. ఎవరో గుర్తుపట్టండి.

ఆ కుర్రాడు మరెవరో కాదండి.. నందమూరి హీరో తారకరత్న. సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన మోహన్ కృష్ణ కుమారుడే తారకరత్న. 1983లో జన్మించిన ఆయన.. 20ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోగా అరంగేట్రం చేశారు. మొదటి చిత్రం ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో ఆయనకు వరుస సినిమా ఆఫర్స్ క్యూకట్టాయి. దీంతో ఏకంగా ఒకే సమయంలో తొమ్మిది సినిమాలను అనౌన్స్ చేశారు.

భద్రాద్రి రాముడు, యువరత్న, నో సినిమాలు రిలీజ్ అయి సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు అన్ని అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొద్దిరోజులుగా ఉండస్రీకి దూరంగా ఉంటున్నారు. హీరోగానే కాదు.. విలన్ గానూ మెప్పించారు. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో రాజకీయాల్లోకి రావాలని భావించారు.

ఇవి కూడా చదవండి
Tarakaratna

Tarakaratna

కొద్ది రోజులుగా టీడీపీ పార్టీలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న ఆయన కుప్పం సమీపంలో స్పృహ తప్పి పడిపోయారు. ప్రస్తుతం ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య, కూతురు ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..