AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundeep Kishan: ఆ హీరోయిన్‏తో ప్రేమాయణంపై స్పందించిన యంగ్ హీరో.. క్లోజ్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్..

. హ్యాపీ బర్త్ డే పాప.. ఐ లవ్ యూ..ఎప్పుడూ నీకు మంచే జరగాలి అంటూ ట్వీట్ చేశాడు. దీంతోపాటు.. రెజీనాతో క్లోజ్ గా తీసుకున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ఇది చూసి వారిద్దరి రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ తమిళనాట ప్రచారం జోరందుకుంది. తాజాగా ఈ వార్తలపై యంగ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు.

Sundeep Kishan: ఆ హీరోయిన్‏తో ప్రేమాయణంపై స్పందించిన యంగ్ హీరో.. క్లోజ్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్..
Sundeep Kishan
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2023 | 6:39 AM

Share

సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్స్ మధ్య ప్రేమాయణం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ , రిలేషన్ షిప్ గురించి ఎక్కువగా రూమర్స్ వినిపిస్తుంటాయి. ఇటు దక్షిణాదిలోనూ ఇటీవల కొందరు తారలు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా యంగ్ హీరో సందీప్ కిషన్ , హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్ లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఇటీవల రెజీనా బర్త్ డే సందర్భంగా.. సందీప్ కిషన్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. హ్యాపీ బర్త్ డే పాప.. ఐ లవ్ యూ..ఎప్పుడూ నీకు మంచే జరగాలి అంటూ ట్వీట్ చేశాడు. దీంతోపాటు.. రెజీనాతో క్లోజ్ గా తీసుకున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ఇది చూసి వారిద్దరి రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ తమిళనాట ప్రచారం జోరందుకుంది. తాజాగా ఈ వార్తలపై యంగ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు.

ఇటీవల మైఖేల్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సందీప్ కిషన్ ను సదరు యాంకర్ అదే ఫోటో చూపిస్తూ క్లారిటీ అడగ్గా.. సందీప్ స్పందిస్తూ.. “మేమిద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్యామిలీ మెంబర్ లాగా.. తను పని మీద బాంబే వచ్చినప్పుడు మా సోదరి గదిలోనే ఉంటుంది. 12 సంవత్సరాలుగా మేం ఒకరికొకరం తెలుసు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే. సందీప్ రెజీనా ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రస్ట్ ఉండదు. వాళ్ల మధ్య ఏదో ఉంది అంటే సర్ ప్రైజ్ అవుతారు. అందుకని చెన్నై మీడియా మా గురించి తెలియక అలా రాసేవారు” అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..