ఈ డైట్‌ప్లాన్‌తోనే 40 కిలోల బరువు తగ్గా.. తన వెయిట్‌లాస్ సీక్రెట్స్ రివీల్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ సతీమణి
Basha Shek |
Updated on: Feb 07, 2023 | 4:10 PM
ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా భార్య లిజెల్ డిసౌజా ఇటీవల తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. కాగా ఒకప్పుడు భారీకాయంతో కనిపించిన ఆమె ఇప్పుడు స్లిమ్‌గా మారి నాజుగ్గా తయారైంది.
Feb 07, 2023 | 4:10 PM
ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా భార్య లిజెల్ డిసౌజా ఇటీవల తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. కాగా ఒకప్పుడు భారీకాయంతో కనిపించిన ఆమె ఇప్పుడు స్లిమ్‌గా మారి నాజుగ్గా తయారైంది.
1 / 5
ఒకప్పుడు లిజెల్ 105 కిలోల బరువు ఉండేవారు. ఇప్పుడామె దానిని 65 కిలోలకు తగ్గించింది. ప్రస్తుతం లీజెల్ డిసౌజా ట్రాన్స్‌ఫర్మేషన్ ఫొటోలను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
2 / 5
అయితే ఇలా 40 కిలోల బరువు తగ్గడం అంత సులభం కాదంటూ లిజెల్ ఒక ఫొటోను పంచుకుంది. ఇందుకోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అతిపెద్ద యుద్ధం మీతో పోరాడాలి . తద్వారా మీరు అసాధ్యమైన లక్ష్యాన్ని సాధించవచ్చు అని తనలా భారీకాయంతో ఉన్న వాళ్లలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేసింది.
3 / 5
కాగా లిజెల్ డిసౌజా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా 15-20 కిలోల బరువు తగ్గించుకుంది. ఆ తర్వాత జిమ్‌లో వ్యాయామం, అలాగే వెయిట్ ట్రైనింగ్ చేయడం ద్వారా మరింత బరువును కరిగించుకుంది.
4 / 5
లీజెల్ డిసౌజా డైట్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆమె బయటి ఆహారాన్ని తినడం పూర్తిగా మానేసింది. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను క్రమంగా 18-20 గంటలకు పెంచడం ద్వారా స్లిమ్‌గా మారిపోయారు.