Shaakuntalam Movie: సమంత ఫ్యాన్స్‏కు మరోసారి నిరాశే.. శాకుంతలం మళ్లీ వాయిదా.. అఫీషియల్‏గా ప్రకటించిన మేకర్స్..

ఈ సినిమా కోసం ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. కొద్దిరోజులుగా ఈ సినిమా వాయిదా అంటూ వస్తున్న వార్తలు నిజమేనంటూ దృవీకరించారు మేకర్స్. శాకుంతలం సినిమా విడుదల వాయిదా అంటూ మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా ప్రకటించారు.

Shaakuntalam Movie: సమంత ఫ్యాన్స్‏కు మరోసారి నిరాశే.. శాకుంతలం మళ్లీ వాయిదా.. అఫీషియల్‏గా ప్రకటించిన మేకర్స్..
Shaakuntalam
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 07, 2023 | 2:00 PM

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ఈ చిత్రం. ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ మ‌రోసారి ‘శాకుంతలం’ వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ట్రైల‌ర్, సాంగ్స్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి. దీంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. కొద్దిరోజులుగా ఈ సినిమా వాయిదా అంటూ వస్తున్న వార్తలు నిజమేనంటూ దృవీకరించారు మేకర్స్. శాకుంతలం సినిమా విడుదల వాయిదా అంటూ మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా ప్రకటించారు.

“ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాను విడుదల చేయలేకపోతున్నామని ప్రేక్షకులకు తెలిపేందుకు చింతిస్తున్నాం. రిలీజ్ డేట్ ను త్వరలోనే తెలియజేస్తాం. నిరంతరం మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ నోట్ చేశారు గుణ్ టీమ్. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడమే ఉందుకు కారణమని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటించారు. ఇందులో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, అల్లు అర్హ, గౌతమి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ మూవీ.. 2డీ.. 3డీ.. ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇప్పుడిప్పుడే మయోసైటిస్ సమస్య నుంచి కోలుకుంటున్న సామ్.. ప్రస్తుతం సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్