AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: తన కూతరిపై వస్తోన్న రూమర్స్‏ను ఖండించిన త్రిష తల్లి.. ఫోటోస్ షేర్ చేస్తూ క్లారిటీ..

అలాగే ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో అంచనాలను పెంచేసింది. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి నెట్టింట పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Trisha: తన కూతరిపై వస్తోన్న రూమర్స్‏ను ఖండించిన త్రిష తల్లి.. ఫోటోస్ షేర్ చేస్తూ క్లారిటీ..
Trisha 1
Phani CH
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 08, 2023 | 3:06 PM

Share

టాలీవుడ్ అగ్రహీరోయిన్‏గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది త్రిష. దాదాపు 20 ఏళ్లుగా దక్షిణాదిలో చక్రం తిప్పుతుంది ఈ ముద్దుగుమ్మ. కొంతకాలం అవకాశాలు తగ్గినా.. ఇటీవల డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ మారిపోయింది. ఇందులో త్రిష మరింత అందంగా కనిపించడమే కాకుండా.. నటనపరంగానూ మరోసారి ఆకట్టుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం ఆమె తమిళ్ స్టా్ర్ హీరో విజయ్ దళపతి.. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతున్న లియో చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ వేడుకలకు హీరోయిన్ త్రిష కూడా హజరయ్యింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ సూపర్ హిట్ జోడి మళ్లీ నటిస్తుండడంతో లియో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో అంచనాలను పెంచేసింది. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి నెట్టింట పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఈ సినిమా నుంచి హీరోయిన్ త్రిష తప్పుకున్నట్లుగా కొద్ది రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం కొన్ని రోజుల క్రితం చెన్నై విమానాశ్రయంలో ఆమె కనిపించడమే. దీంతో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందంటూ ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది. అయితే అక్కడి నుంచి పలు ఫోటోస్, వీడియోస్ షేర్ చేసిన త్రిష.. అనుకోకుండా కొద్దిరోజుల క్రితం చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లను ఆమె తల్లి ఉమా కృష్ణన్ కొట్టిపారేశారు. ఫిబ్రవరి 8న ఆమె కాశ్మీర్ నుంచి కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. దీంతో త్రిష ఈ ప్రాజెక్టులో కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న లియో చిత్రాన్ని భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇందులో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.

ఇవి కూడా చదవండి
Trisha

Trisha

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై