AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: టీమిండియా టెస్టు జట్టులోకి తెలుగు తేజం.. మైదానంలో ఎమోషనలైన తల్లి.. సీఎం జగన్ స్పెషల్ విషెస్

గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 09) ప్రారంభమైన తొలి టెస్టులో తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే భరత్ మ్యాచ్‌ ఆడుతున్నాడని తెలిసి అతని తల్లి ఎమోషనల్ అయింది. గ్రౌండ్ లో తన తనయుడిని ఆప్యాయతతో హత్తుకుని ముద్దు పెట్టుకుంది.

IND vs AUS: టీమిండియా టెస్టు జట్టులోకి తెలుగు తేజం.. మైదానంలో ఎమోషనలైన తల్లి.. సీఎం జగన్ స్పెషల్ విషెస్
Ks Bharat, Cm Jagan
Basha Shek
|

Updated on: Feb 10, 2023 | 8:01 AM

Share

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియా గెలిచినా, ఓడిపోయినా ఈ జెంటిల్మెన్‌ గేమ్‌కు ఉండే పాపులారిటీ ఏ మాత్రం తగ్గదు. అలాంటి గేమ్‌లో ఆడాలని, టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ అతి కొద్దిమందికే ఆ అవకాశం దక్కుతుంది. ట్యాలెంట్‌ ఉండి, పరిస్థితులు అన్ని అనుకూలించి.. టీమిండియా అవకాశం తలుపు తడితే మాత్రం అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ఆ క్రికెటర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు గాల్లో తేలిపోతారు. తాజాగా అలాంటి అద్భుతమైన సంఘటనకు నాగ్‌పూర్‌ టెస్ట్ వేదికగా నిలిచింది. బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 09) ప్రారంభమైన తొలి టెస్టులో తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే భరత్ మ్యాచ్‌ ఆడుతున్నాడని తెలిసి అతని తల్లి ఎమోషనల్ అయింది. గ్రౌండ్ లో తన తనయుడిని ఆప్యాయతతో హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ట్యాలెంట్‌ ఉన్నా జట్టులో చోటు కోసం కొన్నేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు భరత్. టెస్టు జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. సాహా, పంత్ జట్టులో పాతుకుపోవడం వల్ల మైదానంలో దిగే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయాడు. అయితే గత ఏడాది చివరలో పంత్ కు యాక్సిడెంట్ జరగడంతో అతని స్థానంలో కేఎస్ భరత్ టీమిండియాలోకి ఎంపికయ్యాడు.

మూడేళ్లుగా ఎదురుచూపులకు మోక్షం..

ఇక భరత్‌ విషయానికొస్తే.. అతని స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం. శ్రీనివాసరావు, దేవి దంపతులకు 1993 అక్టోబరు 3న జన్మించాడు. తండ్రి విశాఖపట్నంలో నావీలో ఉద్యోగం ఉండడంతో ఆయన విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. ఇక భరత్ 2012లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి భరత్‌ 9 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. ఆతర్వాత 2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో 308 పరుగులు చేశాడు. తద్వారా రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తొలి వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిభతో భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిపోయాడు భరత్‌. ఇక 2015లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే అతనికి మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌-2021 సీజన్‌ మినీ వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 లక్షలు వెచ్చించి భరత్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మొత్తం 191 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి తన జట్టును గెలిపించడం క్రికెట్‌ అభిమానులందరికీ గుర్తుండిపోతుంది. కాగా రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ కోసం భరత్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే అప్పటికే పంత్‌ జట్టులో కుదురుకోవడంతో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. కేఎస్‌ భరత్‌ 2021 నవంబర్ నాటికీ 78 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 4283 పరుగులు చేశాడు. అలాగే లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 51 మ్యాచ్‌లు ఆడి 1351 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో 48 మ్యాచ్‌లు ఆడి 730 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 9 సెంచరీలు 23 హాఫ్‌ సెంచరీలు, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 3 సెంచరీలు 5 హాఫ్‌ సెంచరీలు, టీ20 క్రికెట్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు టీమిండియాలో స్థానం దక్కించుకుని తన కలను సాకారం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by K S Bharat (@konasbharat)

సీఎం జగన్‌ ప్రత్యేక అభినందనలు..

కాగా టీమిండియాలో చోటు దక్కించుకున్న శ్రీకర్‌ భరత్‌కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ భరత్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మా తెలుగు తేజం భరత్‌కు అభినందనలు, శుభాకాంక్షలు. తెలుగు జాతి గర్వపడేలా భరత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు’ అని ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..