Mekapati Chandra Sekhar Reddy: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు.

Mekapati Chandra Sekhar Reddy
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చంద్రశేఖర్‌రెడ్డి గుండె రక్తనాళాల్లో రెండుచోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు. ఎమ్మెల్యే పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించేయోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త విషయంలో ఆయన సొంత పార్టీపై విమర్శలు చేశారు. దీంతో ఎట్టకేలకు ఆయన అభ్యర్థన మన్నించి కొత్త సమన్వయకర్తను నియమించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.