AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana: కియారా- సిద్ధార్థ్‌ దంపతులకు సారీ చెప్పిన కొణిదెల ఉపాసన.. కారణమేంటంటే?

కియారా- సిద్ధార్థ్‌ల పెళ్లి వేడుకకు సంబంధించి పలువురు టాలీవుడ్‌ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. అందులో  రామ్‌చరణ్‌- ఉపాసన జంట కూడా ఉంది. అయితే పలు కారణాల రీత్యా వీరు కియారా పెళ్లికి హాజరు కాలేకపోయారు

Upasana: కియారా- సిద్ధార్థ్‌ దంపతులకు సారీ చెప్పిన కొణిదెల ఉపాసన.. కారణమేంటంటే?
Kiara Advani, Upasana
Follow us
Basha Shek

|

Updated on: Feb 08, 2023 | 12:47 PM

బాలీవుడ్‌ ప్రేమజంట కియారా అద్వానీ- సిద్దార్థ్‌ మల్హోత్రా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌ వేదికగా వేదమంత్రాల సాక్షిగా మంగళవారం (ఫిబ్రవరి 7) కియారా- సిద్ధార్థ్‌ ఏడడుగులు నడిచారు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. కాగా కియారా- సిద్ధార్థ్‌ల పెళ్లి వేడుకకు సంబంధించి పలువురు టాలీవుడ్‌ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. అందులో  రామ్‌చరణ్‌- ఉపాసన జంట కూడా ఉంది. అయితే పలు కారణాల రీత్యా వీరు కియారా పెళ్లికి హాజరు కాలేకపోయారు. దీంతో కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెబుతూనే క్షమాపణలు చెప్పింది. వీలు కుదరకపోవడం వల్లే పెళ్లికి హాజరు కాలేకపోయామని ఉపాసన పేర్కొంది. ఈ మేరకు కియారా తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా.. ‘కంగ్రాట్స్‌ కియారా. మీ జోడీ చూడముచ్చటగా ఉంది. పెళ్లికి మేం హాజరు కాలేకపోయినందుకు సారీ. మీ ఇద్దరికీ మరోసారి నా అభినందనలు’ అని ఉపాసన కామెంట్‌ చేసింది. కాగా మహేశ్‌ బాబు భరత్‌ అనే నేను సినిమాతో టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో కలిసి వినయ విధేయరామ సినిమాలో కనిపించింది. అప్పటి నుంచి చెర్రీ – కియారా మంచి స్నేహితులయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌సీ15 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా తమ వివాహ వేడుక అనంతరం తమ పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారీ కొత్త దంపతులు. ‘ఇప్పుడు మేం శాశ్వతంగా ఒక్కటయ్యాం. మా కొత్త ప్రయాణానికి మీ దీవెనలు కావాలి’ అని వీటికి క్యాప్షన్‌ ఇచ్చారు బీ-టౌన్‌ లవ్లీ కపుల్‌. ప్రస్తుతం కియారా- సిద్ధార్థ్‌ల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత, రష్మిక మందన, అలియా భట్‌, కత్రినా కైఫ్‌, వరుణ్‌ ధావన్‌, విక్కీ కౌశల్‌, అనిల్‌ కపూర్‌, అనుపమ పరమేశ్వరన్‌ సహా తదితర తారలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..