- Telugu News Photo Gallery Cinema photos Kiara Advani And Siddarth Malhotra Wedding Photos Goes Viral On Social media
Kiara Advani- Siddarth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల పెళ్లి ఫొటోలు చూశారా? కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో!!
జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా- సిద్ధార్థ్‌ల వివాహం వేడుకకు వేదికైంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
Updated on: Feb 08, 2023 | 6:35 AM

బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా- సిద్ధార్థ్‌ల వివాహం వేడుకకు వేదికైంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, రామ్ చరణ్, మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్‌తో పాటు వ్యాపార దిగ్గజం ఇషా అంబానీతో సహా పలువురు సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు.

వివాహ వేడుక అనంతరం తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారీ కొత్త దంపతులు. 'ఇప్పుడు మేం శాశ్వతంగా ఒక్కటయ్యాం. మా కొత్త ప్రయాణానికి మీ దీవెనలు కావాలి' అని వీటికి క్యాప్షన్ ఇచ్చారు బీ-టౌన్ లవ్లీ కపుల్.

కాగా పెళ్లి తర్వాత రెండు గ్రాండ్‌గా రిసెప్షన్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు కియారా దంపతులు. ఫిబ్రవరి 12న ముంబైలోని తమ సినిమా ఇండస్ట్రీ స్నేహితుల కోసం, ఫిబ్రవరి 9న దిల్లీలోని వరుడి కుటుంబ సభ్యుల కోసం మరో రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.




