Vijay Deverakonda: పులికి పాలుపట్టి.. పాములను మెడలో వేసుకుని.. క్రూర జంతువులతో లైగర్‌ క్రేజీ గేమ్స్‌.. వీడియో వైరల్‌

సినిమా షూటింగుల నుంచి కాస్త విరామం లభించడంతో వెకేషన్‌కు చెక్కేశాడు రౌడీబాయ్‌. కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌ విహార యాత్రకు వెళ్లాడు. తాజాగా తన టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు విజయ్‌. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Vijay Deverakonda: పులికి పాలుపట్టి.. పాములను మెడలో వేసుకుని.. క్రూర జంతువులతో లైగర్‌ క్రేజీ గేమ్స్‌.. వీడియో వైరల్‌
Vijay Devarakonda
Follow us
Basha Shek

|

Updated on: Feb 07, 2023 | 3:44 PM

లైగర్‌ ఫెయిల్యూర్‌ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్న విజయ్‌ దేవరకొండ మళ్లీ సినిమాలతో బిజీ కానున్నాడు. త్వరలోనే సమంతతో కలిసి ఖుషి సినిమా షూటింగులలో పాల్గొననున్నాడు. అలాగే జెర్సీ ఫేమ్‌ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. కాగా సినిమా షూటింగుల నుంచి కాస్త విరామం లభించడంతో వెకేషన్‌కు చెక్కేశాడు రౌడీబాయ్‌. కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌ విహార యాత్రకు వెళ్లాడు. తాజాగా తన టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు విజయ్‌. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ ట్రిప్ వెళ్లిన విజయ్ దేవరకొండ.. అక్కడి ఫేమస్ పార్క్‌ను సందర్శించాడు. సైఫ్ బెల్సాసా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఈ ప్రైవేట్ జూ పార్క్‌లో సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా అక్కడి జంతవులతో ఆటలాడాడీ క్రేజీ హీరో. ముందుగా అక్కడి పక్షులు, కోతులు తదితర చిన్న జంతువులకు ఫుడ్‌ తినిపించాడు. ఆ తర్వాత పాములను మెడలో వేసుకున్నాడు. అలాగే భారీ సైజు ఫైథాన్లను శరీరంపై పాకించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇకబోనులో ఉన్న సింహంతో తాడు ఆట ఆడిన విజయ్.. ఏకంగా పులి పిల్లలను ఒళ్లో ఆడించాడు. అంతేకాదు వాటికి పాలు కూడా పట్టాడు. మొత్తానికి పార్క్‌లోని జంతువులు, పక్షులతో తన సమయాన్ని సరదాగా గడిపాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న విజయ్‌ ‘బ్యూటిఫుల్‌ గార్డెన్.. రామచిలుకలు, పక్షులు, విచిత్రమైన జంతువులను చూడటం చాలా హ్యాపీగా ఉందన్నాడు. అంతేకాదే పాములంటే భయపడే తనకు ఆ భయాన్ని పోగొట్టారంటూ జూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే సింహం, పులి పిల్లలతో మాట్లాడటానికి సహాయపడిన జూ సిబ్బంది, క్యూరేటర్స్‌కి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నానని కామెంట్స్ షేర్ చేశాడు. ‘నా లైఫ్‌లో ఇదో మధుర జ్ఞాపకం’ అని షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. క్రూర జంతువులతో లైగర్‌ బాగానే సమయాన్ని గడిపారంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఖుషి, గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్టు తర్వాత మరో సినిమాకు ఓకే చెప్పాడు విజయ్‌. తనకు ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురాంతో మరో సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?