Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanghavi: సింధూరం హీరోయిన్‌ సంఘవి గుర్తుందా? పెళ్లి, పిల్లల తర్వాత ఎలా మారిపోయిందో చూశారా?

'హాయ్‌ రే హాయ్‌.. జాం పండు రోయ్‌' అంటూ సింధూరం సినిమాలో రవితేజను తన వెంట తిప్పుకుంది హీరోయిన్‌ సంఘవి. ఆ సినిమాలో ఆమె అందానికి, అమయాకత్వానికి రవితేజ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుర్రకారంతా ఫిదా అయిపోయారు.

Sanghavi: సింధూరం హీరోయిన్‌ సంఘవి గుర్తుందా? పెళ్లి, పిల్లల తర్వాత ఎలా మారిపోయిందో చూశారా?
Sanghavi
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2023 | 9:07 PM

‘హాయ్‌ రే హాయ్‌.. జాం పండు రోయ్‌’ అంటూ సింధూరం సినిమాలో రవితేజను తన వెంట తిప్పుకుంది హీరోయిన్‌ సంఘవి. ఆ సినిమాలో ఆమె అందానికి, అమయాకత్వానికి రవితేజ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుర్రకారంతా ఫిదా అయిపోయారు. కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 1993-2004 మధ్యకాలంలో దక్షిణాదిని స్టార్‌ హీరోయిన్‌గా చెలామణి అయ్యింది. స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. మొత్తం 15 ఏళ్ల సినిమా కెరీర్‌లో 80కు పైగా చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది. కాగా 90 వదశకంలో హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సంఘవి. ఆమె కెరీర్‌లో సింధూరం, తాజ్‌ మహల్‌, నాయుడుగారి కుటుంబం, సూర్యవంశం, సమర సింహారెడ్డి, సీతారామరాజు, ప్రేయసి రావే, లాహిరి లాహిరి లాహిరిలో, సందడే సందడి వంటి హిట్‌ సినిమాలున్నాయి. కాగా ఆలస్యంగా అంటే 38 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. 2016లో బెంగళూరుకు చెందిన వెంకటేశ్‌ అనే ఐటీ ఉద్యోగితో కలిసి పెళ్లిపీటలెక్కారు. ఆతర్వాత 42 ఏళ్ల వయసులో ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది.

సెకెండ్ ఇన్నింగ్స్ లో..

కాగా చాలామంది లాగే సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది సంఘవి. జబర్దస్త్ లాంటి కొన్ని బుల్లితెర టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించింది. అలాగే అలీతో సరదాగా వంటి టాక్‌షోల్లో పాల్గొని సందడి చేసింది. అయితే ఎందుకో కానీ ఆ తర్వాత వెండితెరపై, బుల్లితెరపై అసలు కనిపించలేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. తన భర్త, కూతురితో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. ఇటీవల మీనా భర్త చనిపోయినప్పుడు స్వయంగా ఆమె ఇంటికెళ్లి పరామర్శించింది. మీనా, సంఘవిలిద్దరూ సినిమా ఇండస్ట్రీలో మంచి స్నేహితలని టాక్‌ ఉంది. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న తన కూతురి ఆలనాపాలనలోనే బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..