AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: ‘బాసే కాబోయే సీఎం..ఇక సినిమాల్లేవ్‌ బ్రదర్‌’.. పవన్‌ కల్యాణ్‌పై బండ్ల గణేశ్‌ ట్వీట్‌ వైరల్‌

బండ్ల గణేశ్‌ పవర్‌స్టార్‌తో మళ్లీ సినిమా తీయనున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్లే అప్పుడప్పుడు తన ట్వీట్ల ద్వారా హింట్లు ఇస్తూ వచ్చాడు గణేశ్‌. అయితే ఇవేవీ కార్యరూపం దాల్చలేదు.

Bandla Ganesh: 'బాసే కాబోయే సీఎం..ఇక సినిమాల్లేవ్‌ బ్రదర్‌'.. పవన్‌ కల్యాణ్‌పై బండ్ల గణేశ్‌ ట్వీట్‌ వైరల్‌
Pawan Kalyan, Bandla Ganesh
Basha Shek
|

Updated on: Feb 04, 2023 | 8:12 PM

Share

సినిమాలు చేయకపోయినా సోషల్‌ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో ఉంటాడు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను అమితంగా ఆరాధించే బండ్లన్న నిత్యం ఏదో ఒక విషయంపై ట్వీట్లు చేస్తూ నెటిజన్లను పలకరిస్తుంటాడు. కొన్నిసార్లు అవి వివాదాస్పదం కూడా అవుతుంటాయి. కాగా పవర్‌స్టార్‌తో తీన్‌మార్‌, గబ్బర్‌ సింగ్‌ సినిమాలను నిర్మించాడు గణేశ్‌. ఇందులో తీన్‌మార్‌ నిరాశపరచగా, గబ్బర్ సింగ్‌ మాత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీలతో సినిమాలు చేసి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగిపోయాడు. అయితే గత కొన్నేళ్లుగా సినిమా నిర్మాణాలకు దూరంగా ఉన్నాడాయన. 2015లో ఎన్టీఆర్‌తో టెంపర్‌ సినిమా తర్వాత మరే సినిమాను ప్రొడ్యూస్‌ చేయలేదు. అయితే ఈ మధ్యన డేగల బాబ్జీ అంటూ హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. అలాగే మోహన్‌బాబు సన్‌ ఆఫ్‌ ఇండియాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్‌ పవర్‌స్టార్‌తో మళ్లీ సినిమా తీయనున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్లే అప్పుడప్పుడు తన ట్వీట్ల ద్వారా హింట్లు ఇస్తూ వచ్చాడు గణేశ్‌. అయితే ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ మాత్రం అటు రాజకీయాలతో బిజీగా ఉండగానే వరుసగా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్‌ చేస్తున్నాడు. ఈక్రమంలో పవన్‌తో సినిమాపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బండ్లన్న.

తాజాగా ట్విట్టర్‌ ద్వారా నెటిజన్లతో ముచ్చటించిన ఆయనను ఒక అభిమాని ‘గణేశ్‌ అన్నా.. పవన్‌ కల్యాణ్‌ గారితో ఒక మూవీ చేయాలి. మీరెప్పుడు చేస్తారు. పీఎస్‌పీకే ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఇక్కడ’ అని ప్రశ్నించాడు. దీనికి బాస్‌ కాబోయే సీఎం.. ఇక సినిమాలు లేవు’ అని రిప్లై ఇచ్చాడు బండ్ల. తద్వారా పవన్‌తో సినిమా ఉండడని క్లారిటీ ఇచ్చేశాడు. అదే సమయంలో పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని ఏపీకి కాబోయే కల్యాణేనంటూ మరోసారి పవర్‌స్టార్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..